ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > నోటిఫికేషన్‌

ఏపీ వార్డు సచివాలయాల్లో 2146 పోస్టులు

ఈనాడు: ఆంధ్ర ప్రదేశ్ లో వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీల భర్తీకి మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటన విడుదలచేసింది. దరఖాస్తులు జనవరి 11 (శనివారం) నుంచి మొదలవుతాయి. జనవరి 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష, సిలబస్ వివరాలు గ్రామసచివాలయం, వార్డు సచివాలయం వెబ్ సైట్లలో లభిస్తాయి.
విభాగాల వారీ ఖాళీలు ఇలా...
వార్డ్ అడ్మినిస్ట్రేటవ్ సెక్ర‌ట‌రీ-105,
వార్డ్ ఎమినిటీస్ సెక్ర‌ట‌ర్‌-371,
వార్డ్ శానిటేష‌న్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్ర‌ట‌రీ-513,
వార్డ్ ఎడ్యుకేష‌న్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్ర‌ట‌రీ-100,
వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేష‌న్ సెక్ర‌ట‌రీ-844,
వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెక్ర‌ట‌రీ-213.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.01.2020.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.01.2020.