ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > కరెంట్‌ అఫైర్స్‌

ఆరోగ్య గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడ?

1. 2020 సంవత్సరానికి యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌గా ఎంపిక చేసింది?
1) ప్రిటోరియా, దక్షిణాఫ్రికా 2) పారిస్‌, ఫ్రాన్స్‌
3) రియోడిజెనిరో, బ్రెజిల్‌ 4) న్యూయార్క్‌, అమెరికా

2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏ సంవత్సరం నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది?
1) 2020 2) 2025 3) 2030 4) 2035

3. 2019 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత శాతం వృద్ధి చెందాయి?
1) 12.2% 2) 14.2% 3) 16.2% 4) 18.2%

4. 2019 ఆగస్టు 9న ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి పురస్కారం ఎవరికి లభించింది?
1) ఆయుష్మాన్‌ ఖురానా 2) విక్కీ కౌశల్‌
3) తలాహ్‌ అర్షద్‌ రేసి 4) 1, 2

5. ‘హెల్తీ స్టేట్స్‌ : ప్రోగ్రెసివ్‌ ఇండియా’ పేరుతో రాష్ట్రాల ఆరోగ్య గణాంకాలతో నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 1 2) 2 3) 3 4) 4

6. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి?
1) తమ్మినేని సీతారాం 2) కోన రఘుపతి
3) కోన ప్రభాకరరావు 4) అంబటి రాంబాబు

7. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2001 2) 2003 3) 2005 4) 2007

8. పార్లమెంటరీ వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కేబినెట్‌ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1) నిర్మలా సీతారామన్‌ 2) అరుణ్‌ జైట్లీ
3) రాజ్‌నాథ్‌ సింగ్‌ 4) నరేంద్ర సింగ్‌ తోమర్‌

9. ఫ్రెంచ్‌ ఓపెన్‌ - 2019 మహిళల సింగిల్స్‌ టైటిల్‌ విజేత?
1) సెరెనా విలియమ్స్‌, అమెరికా 2) ఆష్లీ బార్టీ, ఆస్ట్రేలియా
3) మార్కెటా వోండ్రోసోవా, చెక్‌ రిపబ్లిక్‌ 4) సిమోనా హలెప్‌, రొమేనియా

10. 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌?
1) రూ.25,866.23 కోట్లు 2) రూ.26,866.23 కోట్లు
3) రూ.27,866.23 కోట్లు 4) రూ.28,866.23 కోట్లు

11. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పెన్షన్‌ పొందేందుకు కనీసం ఎంత శాతం వైకల్యం ఉన్నవారు అర్హులు?
1) 40% 2) 50% 3) 60% 4) 70%

12. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద వివిధ కేటగిరీల్లో అత్యధికంగా రూ.3 వేల పెన్షన్‌ను పొందుతున్నవారు?
1) వృద్ధులు 2) ఎయిడ్స్‌ రోగులు
3) ట్రాన్స్‌జెండర్‌లు 4) మత్స్యకారులు

13. ఎంతమంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) 1000 2) 2000 3) 3000 4) 4000

14. వైఎస్‌ఆర్‌ షాదీకా తోఫా పేరుతో మైనారిటీ యువతుల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ఎంత మొత్తం కేటాయించింది?
1) రూ.100 కోట్లు 2) రూ.150 కోట్లు
3) రూ.200 కోట్లు 4) రూ.250 కోట్లు

15. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా ఎంత మొత్తం ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు?
1) రూ.10 వేలు 2) రూ.20 వేలు
3) రూ.25 వేలు 4) రూ.30 వేలు

సమాధానాలు
1-3; 2-3; 3-2; 4-4; 5-2; 6-2; 7-1; 8-3; 9-2; 10-4; 11-1; 12-3; 13-2; 14-1; 15-1.

ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు

* అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన ప్రపంచకప్‌ ఎలెవన్‌ జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లు రోహిత్‌శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా చోటు పొందారు.
* టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీకి ఈ జట్టులో స్థానం దక్కలేదు.
* న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ జట్టుకు సారథిగా ఎంపికయ్యారు.

ఆరోగ్య రాయబారిగా బాపూజీ
* ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన జీవనశైలి విషయంలో పాఠశాల పిల్లలకు అవగాహన పెంచేందుకు మహాత్మా గాంధీని ఆరోగ్య రాయబారిగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ప్రచారం చేస్తోంది.
* ఈ కార్యక్రమానికి మిషన్‌ శక్తి (స్కూల్‌ బేస్డ్‌ హెల్త్‌ అవేర్‌నెస్‌, నాలెడ్జ్‌ టెస్ట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిషియేటివ్‌) అని పేరు పెట్టారు.


సీహెచ్‌ కృష్ణప్రసాద్‌
విషయ నిపుణులు
Posted on 24-08-2019