ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

ఎస్పీడీసీఎల్‌లో 5,107 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

తిరుపతి నగరం, న్యూస్‌టుడే: డిస్కం పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) ఆగ‌స్టు 2న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేసేందుకు అవసరమైన 5,107 పోస్టులను పురుషులతో భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగ‌స్టు 17 చివరి తేదీ. ఐటీఐ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో రూ.15,000 చొప్పున వేతనాన్ని రెండు సంవత్సరాలపాటు ఇవ్వనున్నారు.


Posted on 05-08-2019