ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

సచివాలయ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు గడువు పొడిగించింది. తొలుత నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఆగ‌స్టు 10వ తేదీ రాత్రి 11.59 గంటలతో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని 11వ తేదీ రాత్రి 11.59 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరద పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని కోరుతూ అభ్యర్థుల నుంచి అందిన వినతులపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా 10వ తేదీ రాత్రి 8.30 గంటల సమయానికి మొత్తంగా 21,64,490 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కేటగిరి-1కి 12,36,277, కేటగిరి-2 (ఏ)కి 1,34,371, కేటగిరి-2 (బి)కి 1,63,744, కేటగిరి-3కి 6,30,098 దరఖాస్తులొచ్చాయి. 10వ తేదీ ఒక్క రోజే 1,20,300 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా చూస్తే కేటగిరి-1 విభాగంలోని పోస్టులకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు.

Posted on 10-08-2019