ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

సచివాలయ ఉద్యోగార్థులకు 6,163 పరీక్ష కేంద్రాలు

ఈనాడు, అమరావతి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగార్థుల కోసం 6,163 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆగ‌స్టు 14న‌ ఈ మేరకు నిర్ణయించారు. దరఖాస్తుదారులకు సెప్టెంబ‌రు 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. వీరందరికీ మూడు అంచెల్లో పరీక్ష కేంద్రాల ఏర్పాటు కోసం కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై పంచాయతీరాజ్‌, పురపాలక, పోలీసు శాఖల ఉన్నతాధికారులు చర్చించారు. అనంతపురం జిల్లాలో 771, చిత్తూరు 450, తూర్పు గోదావరి 590, గుంటూరు 415, కృష్ణా 391, కర్నూలు 507, ప్రకాశం 302, నెల్లూరు 617, శ్రీకాకుళం 408, విశాఖపట్నం 522, విజయనగరం 256, పశ్చిమ గోదావరి 620, కడప జిల్లాలో 314 చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటిలో కలిపి 15,64,185 మంది అభ్యర్థులు ఒకేసారి పరీక్షలు రాసే వీలుందని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థుల సదుపాయాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటుపై ఉన్నతాధికారులు చర్చించారు.
ప్రశ్న పత్రాల తయారీలో ఏపీపీఎస్‌సీ సూచనలు: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు ప్రశ్నపత్రాల తయారీ కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ (ఏపీపీఎస్‌సీ) సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటి తయారీ, ముద్రణలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి.

Posted on 15-08-2019