ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

ఒకే రోజు రెండు పరీక్షలు!

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష, సచివాలయాల వీఆర్వో, సర్వేయర్ల నియామకాల రాతపరీక్ష ఒకేరోజు జరుగుతున్నందున పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల నియామకాలకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ గతంలో జరిగింది. ఉత్తీర్ణులైన వారికి ప్రధాన పరీక్షను సెప్టెంబరు 3న నిర్వహించబోతున్నారు. అదేరోజు సచివాలయాల వీఆర్వో, సర్వేయర్ల రాతపరీక్షలు జరగబోతున్నాయి.

Posted on 20-08-2019