ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

రెండు రోజుల్లో 1.84 లక్షల దరఖాస్తులు

* సచివాలయ ఉద్యోగాలకు భారీ స్పందన
ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో గత రెండు రోజులుగా 1,84,073 మంది దరఖాస్తు చేశారు. 1,78,099 మంది పేర్లు నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసుకొని అర్హత మేరకు దరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే వ్యక్తి రెండు, మూడు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసే వీలున్నందున దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. గడువులోగా 20 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Posted on 29-07-2019