ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

మొరాయిస్తున్న వెబ్‌సైట్‌

ఈనాడు, అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేస్తుండటంతో సంబంధిత వెబ్‌సైట్‌ పలు మార్లు మొరాయిస్తోంది. పలు చోట్ల అభ్యర్థుల వివరాలు నమోదు చేశాక.. రెండో దశకు వెళ్లే క్రమంలో నిలిచిపోతోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జులై 30న‌ నిరుద్యోగులు ఇలాంటి పలు సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉండటంతో సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి సేవా కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు.

Posted on 31-07-2019