ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

పరీక్షార్థులకు ఏపీ సీఎం శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జులై 31న ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘అభ్యర్థులందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ ఉద్యోగాలకు అనూహ్య స్పందన వస్తోంది. జులై 30న ఒక్కరోజే 1.34 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, జులై 31న సాయంత్రానికి 4.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాను’ అని పేర్కొన్నారు.

Posted on 01-08-2019