ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

2,859 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ వ్యవస్థ పరిధిలోని 5 జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకులు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ - 2) పోస్టులకు ఈపీడీసీఎల్‌ ఆగస్టు 1న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 2,859 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైనవారు ఆగస్టు 2 నుంచి 17లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
http://gramasachivalayam.ap.gov.in/, http://59.144.184.105/JLM19/ వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేయవచ్చని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్‌ తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మొదటి 20 శాతం ఉద్యోగాల్ని మెరిట్‌ ప్రకారం నింపి, మిగిలిన 80 శాతం ఉద్యోగాల్ని స్థానికులతో నిబంధనలకు అనుగుణంగా భర్తీ చేస్తామని చెప్పారు. ఆయా సర్కిల్‌ పరిధిలోని జిల్లాల వారు లోకల్‌ కిందికి వస్తారన్నారు. ప్రతి అభ్యర్థి గరిష్ఠంగా 3 సర్కిళ్ల వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈ ఏడాది జులై 1 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఐటీఐ ఎలక్ట్రికల్‌, వైర్‌మెన్‌ ట్రేడ్‌ కోర్సుతో పదో తరగతి ఉన్నవారు అర్హులు. ఇంటర్‌లో ఒకేషనల్‌ కోర్సుగా ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌ (ఈడీఏఆర్‌), ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌ (ఈడబ్ల్యూసీ) చేసినవారు కూడా అర్హులేనన్నారు. రిజర్వేషన్లు, ఇతర వివరాల కోసం ఈపీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.

Posted on 02-08-2019