ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > ప్రిపరేషన్‌ గైడెన్స్‌

 • సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా?

  పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో రకరకాల మానసిక పరిస్థితులు కనిపిస్తుంటాయి. అంతా చదవలేకపోయామనీ, ఏదీ గుర్తుండటం లేదనీ, పేపర్లు లీకవుతాయనీ.. ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఆందోళన పడుతుంటారు. అపోహలను వదిలిపెట్టి ధీమాగా.. ధైర్యంగా పరీక్షకు హాజరు కావాలి. ప్రిపేర్ అయినంత వరకు బాగా రాయడానికి ప్రయత్నించాలి.
 • సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా?

  కొద్ది రోజుల్లోనే సర్కారీ కొలువులో కుదురుకునే అరుదైన అవకాశం వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఒక్కసారిగా అందివస్తున్నాయి. పరీక్ష తేదీ దూసుకొచ్చేస్తోంది. అవగాహన లోపంతో, అస్పష్టతతో ఏ చిన్న తప్పటడుగు వేసినా అదృష్టం తల్లకిందులైపోతుంది. సాధారణ అభ్యర్థులు, సాంకేతిక విద్యార్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలో పరిశీలించుకోవాలి. పోటీ పరిస్థితులను అంచనా వేసుకొని, ఎదుర్కోడానికి తగిన స్వీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.
 • సాధిద్దాం... సర్వేయర్‌ కొలువు!

  ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 11,158 గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. సేవాదృకృథంతో పనిచేయాలనుకుంటున్న నిరుద్యోగులకు ఇదో మంచి అవకాశం. నియామక పరీక్షకు కొద్ది వ్యవధి మాత్రమే ఉంది. అభ్యర్ధులు అందుబాటులో ఉన్న సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవటం ముఖ్యం. వివిధ అంశాల పఠనానికి తగిన సమయం కేటాయించుకుని ప్రణాళిక ప్రకారం సన్నద్ధమయితే ఈ పరీక్షలో నెగ్గి కొలువును సాధించవచ్చు!
 • కలిపి చదివితే కలదు లాభం!

  సమయం తక్కువ.. చదవాల్సింది ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ ఇదే సమస్య. అందులోనూ కరెంట్‌ అఫైర్స్‌ అధ్యయనం చేసేటప్పుడు ప్రతిదీ ప్రధానంగా కనిపిస్తుంది. ఎలా ప్రిపేర్‌ కావాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అభ్యర్థులకు ఎదురయ్యే ఆందోళన ఇది. విభాగాల ప్రకారం వర్తమాన వ్యవహారాలను విభజించి..
 • మెంటల్‌ఎబిలిటీ, రీజనింగ్‌, క్యూఏ ప్రిపరేషన్‌ ప్లాన్‌

  గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి దాదాపు అన్నింటి సిలబస్‌లోనూ జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో కూడిన క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉన్నాయి. వీటి నుంచి కనీసం 20 నుంచి 30 ప్రశ్నలను ఆశించవచ్చు. బేసిక్స్‌పై పట్టు సాధించి వీలైనన్ని నమూనా ప్రశ్నలను సంక్షిప్త పద్ధతులతో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 • ఇంజినీర్లకు కొలువుల పిలుపు

  సివిల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. 11,158 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. రాత పరీక్షలో ప్రతిభను ప్రదర్శిస్తే సర్కారీ కొలువు అందుకోవచ్చు.
 • సుస్థిరాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణ

  గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు ప్రకటించిన అన్ని పరీక్షల్లోనూ జనరల్‌ స్టడీస్‌లో భాగంగా ‘సుస్థిరాభివృద్ధి -పర్యావరణ పరిరక్షణ’ అంశం ఉంది. దీనిపై తప్పకుండా ప్రశ్నలు వస్తాయి.
 • అర్థం చేసుకుంటూ.. అనువర్తన కోణంలో!

  గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కోసం జనరల్‌ సైన్స్‌ను అధ్యయనం చేసేటప్పుడు మౌలికాంశాలను నిత్య జీవితానికి అనువర్తన చేస్తూ అర్థం చేసుకోవాలి. తాజా పరిణామాల ఆధారంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ప్రిపేరవ్వాలి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సైన్స్‌లో ఏయే విభాగాలపై దృష్టి పెట్టాలి.
 • మార్కులు 10 - నైపుణ్యాలు 4

  ఎంత సన్నద్ధమైనా ఎంతో కొంత భయాన్ని మిగులుస్తుంది ఆంగ్లం. పరిధి విస్తృతంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది.
 • సమన్వయంతో సాగాలి అధ్యయనం!

  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష సిలబస్‌లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి - ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి’ అని ఇచ్చారు.