ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > జనరల్‌ సైన్స్‌, జంతుశాస్త్రం

ఖనిజ లవణాలు

సూక్ష్మపోషకాలైన విటమిన్లు, ఖనిజలవణాలు శరీరానికి అత్యవసరం. ఇవి జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి. మనిషికి తక్కువ మోతాదులోనే కావాల్సి ఉన్నప్పటికీ వీటి అధ్యయనం మాత్రం పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చి పెడుతుంది. జనరల్‌ సైన్స్‌లో భాగంగా ప్రతి పరీక్షలోనూ తప్పకుండా కొన్ని ప్రశ్నలు ఈ చాప్టర్ల నుంచి వస్తున్నాయి. అభ్యర్థులు తప్పకుండా దృష్టిసారించాలి.

విటమిన్‌లు
విటమిన్‌లు సూక్ష్మపోషక పదార్థాలు. ఇవి మానవ శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఎలాంటి శక్తిని ఇవ్వవు. ఎంజైమ్‌లలో భాగంగా ఉండి వాటిని ఉత్తేజితం చేస్తాయి. విటమిన్‌ల లోపం వల్ల కొన్ని జీవక్రియలు సరిగా జరగక వ్యాధులు వస్తాయి. విటమిన్‌లలో A, B, C, D, E K1, B1, B2, B3, B12 ప్రధానమైనవి. నీటిలో కరిగే విటమిన్‌లు B, C; కొవ్వులో కరిగే విటమిన్‌లు A,D,E,K.
* A విటమిన్‌ లోపం వల్ల రేచీకటి, పొడికళ్లు (గ్జిరాప్తాల్మియా), కెరాటో మలాసియా అనే వ్యాధులు వస్తాయి. ఇది షార్క్‌ చేప కాలేయం నూనెలో ఎక్కువగా ఉంటుంది. క్యారెట్‌, బొప్పాయిల్లో ఈ విటమిన్‌ బీటా కెరోటిన్‌ రూపంలో ఉంటుంది. ఇది కంటిలో ఉండే లాక్రిమల్‌ గ్రంథుల పనితీరుకు అవసరం.
*
C విటమిన్‌ లోపం వల్ల స్కర్వి వ్యాధి కలుగుతుంది. ఇది ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది.
* విటమిన్‌ లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్‌, పెద్దవారిలో ఆస్టియో మలాసియా వ్యాధులు వస్తాయి. చిన్నపేగులో నుంచి కాల్షియం శోషణకు ఈ విటమిన్‌ అవసరం. ఇది కాడ్‌ చేప కాలేయం నూనెలో ఎక్కువగా ఉంటుంది. మన శరీరం సూర్యరశ్మి సహాయంతో B విటమిన్‌ను తయారుచేసుకుంటుంది.
*
E విటమిన్‌ను యాంటీస్టెరిలిటీ విటమిన్‌ లేదా ఫెర్టిలిటీ విటమిన్‌ అంటారు. దీని లోపం వల్ల పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో కొన్నిసార్లు గర్భస్రావం కలగవచ్చు. ఇది గోధుమ బీజకవచ నూనెలో ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది కాబట్టి దీన్ని సౌందర్య పోషక విటమిన్‌ (బ్యూటీ విటమిన్‌) అంటారు.
* K విటమిన్‌ లోపం వల్ల రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది. దీన్ని యాంటీహెమర్రోజిక్‌ కారకం లేదా కొయాగ్యులేషన్‌ విటమిన్‌ అంటారు. ఇది ఆకు కూరల్లో ఉంటుంది. విటమిన్‌ B1 లోపం వల్ల బెరిబెరి వ్యాధి కలుగుతుంది. పొట్టుతీయని ధాన్యాల్లో ఈ విటమిన్‌ ఎక్కువగా లభిస్తుంది. B2 విటమిన్‌ లోపం వల్ల కీలోసిస్‌, గ్లాసైటిస్‌ వ్యాధులు వస్తాయి. D3 విటమిన్‌ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి వస్తుంది. దీన్ని 3D వ్యాధి అని కూడా అంటారు. విటమిన్‌ B12 లో అంతర్భాగంగా ఉండే మూలకం కోబాల్ట్‌. ఇది లోపిస్తే పెరినీషియస్‌ అనీమియా వ్యాధి కలుగుతుంది. ఇది ఎక్కువగా జంతువుల నుంచి లభించే ఆహారంలో ఉంటుంది. ఫోలిక్‌ ఆమ్లం B9 లోపం వల్ల మాక్రోసైటిక్‌ అనీమియా లేదా మెగాలో బ్లాస్టిక్‌ అనీమియా వ్యాధి కలుగుతుంది. బయోటిన్‌ B7 విటమిన్‌ను కోడిగుడ్డు తెల్లసొన గాయం నుంచి రక్షించే విటమిన్‌ అని అంటారు.

ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలుగా మన శరీరంలో వివిధ జీవక్రియలకు ఉపయోగపడతాయి. కొన్ని రోజుకు ఒక గ్రాము అవసరమైతే మరికొన్ని గ్రాము కంటే తక్కువ అవసరం.
* శరీరంలో అయాన్‌ల నీటిక్రమతకు సోడియం అవసరమవుతుంది. ఇది లోపిస్తే హైపోనేట్రిమియా వస్తుంది
* పొటాషియం ద్రవాభిసరణ క్రమతకు, నాడీ ప్రచోదనాల ప్రసారానికి అవసరం. దీని లోపం వల్ల హైపోకాలిమియా వస్తుంది.
* క్లోరిన్‌ శరీరంలో ఆమ్ల - క్షార క్రమతకు, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల తయారీకి అవసరం.
* ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, కండర సంకోచానికి, రక్తం గడ్డకట్టడానికి కాల్షియం అవసరం. ఇది లోపిస్తే ఆస్టియో పోరోసిస్‌ వ్యాధి వస్తుంది. కాల్షియం పాలు, ధాన్యాల్లో అధికంగా రాగులలో లభిస్తుంది.
* ఫాస్ఫరస్‌ ఎముకలు, ATP, కేంద్రకామ్లాల్లో భాగంగా ఉంటుంది.
* ఐరన్‌ హిమోగ్లోబిన్‌లో భాగం. దీని లోపం వల్ల రక్తహీనత (అనీమియా) కలుగుతుంది.
* థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అయోడిన్‌ అవసరం. ఇది లోపిస్తే సరళగాయిటర్‌ వ్యాధి వస్తుంది.
* కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాకు, విటమిన్‌ తి జీవక్రియకు, ఎంజైమ్‌ల ఉత్తేజానికి జింక్‌ అవసరం.
* సాధారణ ప్రత్యుత్పత్తి జీవక్రియలు, ఎంజైమ్‌ల ఉత్తేజానికి మాంగనీస్‌ అవసరం.
* హిమోగ్లోబిన్‌, చర్మంలో మెలనిన్‌ తయారీకి రాగి అవసరం.
* దంతాలపై ఎనామిల్‌ పొర ఉండేందుకు, దంతక్షయాన్ని నిరోధించడానికి ఫ్లోరిన్‌ అవసరం. తాగేనీటిలో ఫ్లోరిన్‌ ఎక్కువైతే ఫ్లోరోసిస్‌ వ్యాధి వస్తుంది.
* సల్ఫర్‌ ఉల్లి, వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటుంది.
* ఎంజైమ్‌ల ఉత్తేజానికి సెలీనియం అవసరం. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

మాదిరి ప్రశ్నలు
1. B1 విటమిన్‌ ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది?
1) పాలు 2) గుడ్డు 3) గోధుమలతో చేసిన పదార్థాలు 4) ఆకు కూరలు

2. పాలు గోధుమ రంగులో ఉండటానికి కారణమైన ఏ విటమిన్‌ను లాక్టోఫ్లేవిన్‌ అంటారు?
1) రైబోఫ్లేవిన్‌ 2) పాంటోథెనిక్‌ 3) నియాసిన్‌ 4) పైరిడాక్సిన్‌

3. రైబోఫ్లేవిన్‌ లోపం వల్ల కలిగే గ్లాసైటిస్‌ వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?
1) కన్ను 2) నాలుక 3) చర్మం 4) గుండె

4. కిందివాటిలో 3D వ్యాధి కానిది?
1) డెర్మటైటిస్‌ 2) డయేరియా 3) డెంగీ 4) డిమెన్షియా

5. విటమిన్‌ B12లో అంతర్భాగంగా ఉండే మూలకం?
1) ఐరన్‌ 2) మాంగనీస్‌ 3) రాగి 4) కోబాల్ట్‌

6. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, వాటి అభివృద్ధికి అవసరమైన విటమిన్‌?
1) థయామిన్‌ 2) విటమిన్‌ B12 3) నియాసిన్‌ 4) పైరిడాక్సిన్‌

7. నియాసిన్‌ (B3 విటమిన్) లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి 2) గ్లాసైటిస్‌ 3) పెల్లాగ్రా 4) కీలోసిస్‌

8. ఏ విటమిన్‌ జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది?
1) విటమిన్‌ B1 2) విటమిన్‌ B2 3) విటమిన్‌ B12 4) విటమిన్‌ A

9. గర్భిణుల్లో ఫోలిక్‌ ఆమ్లం లోపం వల్ల పుట్టబోయే శిశువుల్లో కలిగే వ్యాధి?
1) స్ప్రూ 2) స్పైనాభిఫిడా 3) రికెట్స్‌ 4) గ్జిరాప్తాల్మియా

10. విటమిన్‌ తి లోపం వల్ల కలిగే రేచీకటికి మరొక పేరు?
1) నిక్టలోపియా 2) సిర్రోసిస్‌ 3) గ్లకోమా 4) కాటరాక్ట్‌

11. కంటిలో ఉండే లాక్రిమల్‌ గ్రంథుల పనితీరుకు అవసరమయ్యే విటమిన్‌?
1) విటమిన్‌ C 2) విటమిన్‌ A 3) విటమిన్‌ D 4) విటమిన్‌ K

12. విటమిన్‌ ది అధికంగా దేనిలో ఉంటుంది?
1) పాలు 2) గుడ్లు 3) ఉసిరి 4) టొమాటో

13. క్యారెట్‌, బొప్పాయి, టొమాటో లాంటి వాటిలో విటమిన్‌ తి ఏ రూపంలో ఉంటుంది?
1) ఆల్బుమిన్‌ 2) గ్లోబ్యులిన్‌ 3) ఆంథోసయనిన్‌ 4) బీటా కెరోటిన్‌

14. విటమిన్‌ D రసాయనిక నామం
1) కాల్సిఫెరాల్‌ 2) టొకోఫెరాల్‌ 3) రెటినాల్‌ 4) బయోటిన్‌

15. కిందివాటిలో యాంటీ ఇన్‌ఫెక్టివ్‌ విటమిన్‌?
1) విటమిన్‌ B1 2) విటమిన్‌ B12 3) విటమిన్‌ A 4) విటమిన్‌ D

16. విటమిన్‌ E అధికంగా దేనిలో లభిస్తుంది?
1) సోయా 2) గోధుమ బీజకవచ నూనె
3) పొద్దుతిరుగుడు నూనె 4) వేరుశనగ నూనె

17. విటమిన్‌ D లోపం వల్ల పెద్దవారిలో కలిగే వ్యాధి?
1) స్కర్వి 2) వంధ్యత్వం 3) ఆస్టియో మలాసియా 4) రికెట్స్‌

18. ప్రత్యుత్పత్తి ప్రక్రియకు ఉపయోగపడే విటమిన్‌?
1) విటమిన్‌ E 2) విటమిన్‌ K 3) విటమిన్‌ C 4) విటమిన్‌ D

19. విటమిన్‌ A లోపం వల్ల కలిగే కంటి వ్యాధులు
1) రేచీకటి 2) గ్జిరాప్తాల్మియా 3) కెరాటో మలాసియా 4) అన్నీ

20. థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరమయ్యే మూలకం
1) అయోడిన్‌ 2) జింక్‌ 3) రాగి 4) అల్యూమినియం

సమాధానాలు
1-3; 2-1; 3-2; 4-3; 5-4; 6-2; 7-3; 8-3; 9-2; 10-1; 11-2; 12-3; 13-4; 14-1; 15-3; 16-2; 17-3; 18-1;19-4; 20-1.బి.న‌రేష్‌
Posted on 18-08-2019