close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-I > స్క్రీనింగ్ టెస్ట్ - పేపర్ 1: భూగోళశాస్త్రం

1. సాధారణ భూగోళశాస్త్రం: సౌర వ్యవస్థలో భూమి, భూభ్రమణం, కాలం, రుతువులు, భూ అంతర్భాగం, ముఖ్యమైన భూస్వ‌రూపాలు, వాటి లక్షణాలు. వాతావరణం - నిర్మాణం, కూర్పు, శీతోష్ణస్థితి విభాగాలు, కారకాలు, వాయు ద్రవ్యరాశులు, వాయు సరిహద్దులు (ఫ్రంట్స్‌), వాతావరణ ప్రతిబంధకాలు, శీతోష్ణస్థితి మార్పు. మహాసముద్రాలు: భౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు, జల సంబంధ విపత్తులు, సముద్ర, ఖండాంతర వనరులు.

2. భౌతిక భూగోళశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్‌. ముఖ్యమైన భౌతిక విభాగాలు, భూకంపాలు, భూపాతాలు, సహజ నీటిపారుదల, వాతావరణ మార్పులు, ప్రాంతాలు, రుతుపవనాలు, సహజ ఉద్భిజ సంపద, జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన నేలల రకాలు, శిలలు, ఖనిజాలు.

3. సామాజిక, భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్‌: పంపిణీ, సాంద్రత, వృద్ధి, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, వృత్తి స్వరూపం, ఎస్సీ, ఎస్టీ జనాభా, గ్రామీణ - పట్టణ విభాగాలు, జాతులు, గిరిజన, మత, భాషా సమూహాలు, పట్టణీకరణ, వలసలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాలు.

4. ఆర్థిక భౌగోళికశాస్త్రం: ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్‌: ప్రధాన ఆర్థిక రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వాటి ముఖ్య లక్షణాలు, మౌలిక పరిశ్రమలు - వ్యవసాయ, ఖనిజ, అటవీ, ఇంధన, మానవ ఆధారిత పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, పద్ధతులు - సమస్యలు.