close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-II > ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర

1. ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులు - చరిత్రపై దాని ప్రభావం. పూర్వ చారిత్రకయుగ సంస్కృతులు - శాతవాహనులు, ఇక్ష్వాకులు - సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు, సేవలు, వాస్తు, శిల్పం, విష్ణుకుండినులు, వేంగి, తూర్పు చాళుక్యులు - తెలుగు చోళులు - సమాజం, మతం - తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం

2. క్రీ.శ. 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన ప్రధాన రాజవంశాలు. క్రీ.శ. 11-16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు - సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖనం వృద్ధి.

3. యూరోపియన్‌ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర - 1857 తిరుగుబాటు, ఆంధ్రపై దాని ప్రభావం, ఆంధ్రలో బ్రిటిష్‌ పాలన స్థాపన - సామాజిక చైతన్యం, జస్టిస్‌ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు - 1885-1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ వృద్ధి - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం.

4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటలు, మీడియా, వార్తాపత్రికల పాత్ర, గ్రంథాలయ ఉద్యమం పాత్ర, జానపద, గిరిజన సంస్కృతులు.

5. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు - ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం 1956; విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ సిఫారసులు - పెద్దమనుషుల ఒప్పందం, 1956 - 2014 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ముఖ్య సామాజిక - సాంస్కృతిక సంఘటనలు.