close

తాజా స‌మాచారం

ఉద్యోగ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

* 21న పంచాయతీ కార్యదర్శి నియామకాల స్క్రీనింగ్‌ టెస్ట్‌
ఈనాడు, అమరావతి: తొలుత ప్రకటించిన విధంగానే ఏప్రిల్‌లో ఉద్యోగ నియామక రాత పరీక్షలు యథావిధిగా జరుపుతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. ఏప్రిల్‌ 21న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకాల స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరగనుంది. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4.96 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షా కేంద్రాల ఎంపిక కోసం ఏపీపీఎస్సీ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వారినుంచి వివరాలు అందుతున్నాయని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
* యథాతథంగా ఇతర పరీక్షలు
ఏప్రిల్‌ 17న అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, 25న ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్, డిప్యూటీ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్, 29, 30 తేదీల్లో అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్, 29, 30 తేదీల్లో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్, ఏప్రిల్‌ 29న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, 28, 29 తేదీల్లో రీసెర్చి ఆఫీసర్‌-ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల రాత పరీక్ష రోజునే తెలంగాణలో ఎస్‌ఐ నియామకాలకు చెందిన రాత పరీక్ష జరగనుంది.. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉన్నందున పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల రాత పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

Posted on 03.04.2019