close

తాజా స‌మాచారం

మే 19న ‘ఎఫ్‌ఆర్‌ఓ’ స్క్రీనింగ్‌ టెస్ట్‌

ఈనాడు, అమరావతి: అటవీ రేంజ్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) ఉద్యోగాల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్ట్‌ను మే 19వ తేదీన నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం (ఏప్రిల్ 3న‌) ఒక ప్రకటనలో వెల్లడించింది. 24 పోస్టులకు 16,130 దరఖాస్తులు వచ్చాయని అందులో పేర్కొంది. మార్చిలో జారీచేసిన జీవో నం.39ని అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ను మే 19వ తేదీన జరపనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ జీవోను ఇప్పటికే జారీచేసిన ఉద్యోగ ప్రకటనలకు అమలుచేసే ఆలోచన లేదని ఏపీపీఎస్సీ వివరించింది. ప్రకటిత తేదీల్లో ఇతర ఉద్యోగ నియామక రాత పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేసింది. భవిష్యత్తులో జారీచేయబోయే నోటిఫికేషన్లకు ప్రభుత్వ కొత్త జీఓ అమలుచేస్తామని వెల్లడించింది.

Posted on 04.04.2019