close

తాజా స‌మాచారం

ఏపీలో యథావిధిగా గ్రూపు - 2, 3 పరీక్షలు

ఈనాడు, అమరావతి: గ్రూపు-2, పంచాయతీ కార్యదర్శులు (గ్రూపు-3), ఇతర పోస్టులకు షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ తెలిపారు. ఏప్రిల్‌ 21న గ్రూపు-3 స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నామని, ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఏప్రిల్ 15 నుంచే కల్పించామని తెలిపారు. పరీక్షను ఆఫ్‌లైన్‌లో ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా నిర్వహిస్తామన్నారు. మే 5న గ్రూపు-2 స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఏఈఈ) స్క్రీనింగ్‌ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. రెండు, మూడు నెలల్లో 957 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.

Posted on 16.04.2019