close

తాజా స‌మాచారం

డిసెంబ‌రులో గ్రూప్‌ 1 ప్ర‌ధాన ప‌రీక్ష‌లు

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌రులో నిర్వ‌హించనుంది. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల‌ షెడ్యూలును క‌మిష‌న్ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టించింది. డిసెంబ‌రు 12 నుంచి 23 వ‌ర‌కు ఏడు సెష‌న్ల‌లో ఈ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాష్ట్ర‌ గ్రూపు 1 స‌ర్వీసుల్లో 167 పోస్టుల‌కు మే 26న క‌మిష‌న్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హించింది. అనంత‌రం ప్రధాన పరీక్షలను డిసెంబరు 2 నుంచి 14వ తేదీ వరకు జరుపుతామని జూన్‌ 26న ప్రకటించింది. అయితే యూపీఎస్సీ... ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ నియామక పరీక్షలను డిసెంబరు ఒకటో తేదీ నుంచి నిర్వహిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల షెడ్యూలును తాజాగా స‌వ‌రించింది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూలు

Posted on 04.07.2019