close

తాజా స‌మాచారం

పంచాయతీ కార్యదర్శి పరీక్షలకు హాల్‌టిక్కెట్లు

ఈనాడు, అమరావతి: పంచాయతీ కార్యదర్శి పోస్టుల ప్రధాన రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సూచించింది. ఆగ‌స్టు 26న ఈ పరీక్షను నిర్వహించనుంది. మరోవైపు ఆగ‌స్టు 29, 30 తేదీల్లో గ్రూపు-2 ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. ఈ రెండు పరీక్షలను రాసే అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉన్నారు. పరీక్షల తేదీలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని వారు కోరుతున్నారు. మరోవైపు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి గ్రామసచివాలయ ఉద్యోగాల నియామక రాత పరీక్షలు జరగనున్నాయి.

Posted on 15.07.2019