Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రత్యేక కొలువుకు పక్కా ప్రణాళిక
 

బ్యాంకుల్లో ప్రత్యేక ఉద్యోగ నియామక ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌లలో, సిండికేట్‌ బ్యాంకులో పోస్టుల భర్తీ జరగబోతోంది. ఒకే సన్నద్ధత ద్వారా ఈ రెండు పరీక్షలూ రాసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం!
తాజా నోటిఫికేషన్‌ ద్వారా 40 డిప్యూటీ మేనేజర్‌ (లా) పోస్టులనూ, 140 అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌) పోస్టులనూ ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. ఇదే నోటిఫికేషన్‌ ద్వారా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ కూడా 5 అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌) పోస్టులను భర్తీ చేస్తోంది. అత్యధిక జీతభత్యాలు (నెలకు 70,000 నుంచి 90,000) పొందే అవకాశం ఈ పోస్టుల ప్రత్యేకత.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 26-11-2015
* దరఖాస్తుల ముగింపు: 12-12-2015
* ఆన్‌లైన్‌ పరీక్ష: 17-01-2016
వయః పరిమితులు
* డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు: 21-38సం||
* అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు: 21-30సం|| (అభ్యర్థులు తమ వయసును 30-11-2015 తేదీతో పోల్చుకోవాలి). ** ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 5సం||, ఓబీసీ అభ్యర్థులకు 3 సం||, వికలాంగ అభ్యర్థులకు 10 సం|| మినహాయింపు.
* దరఖాస్తు ఫీజు: ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు 100 రూపాయలు, మిగిలినవారు 600 రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
విద్యార్హతలు
(i) డిప్యూటీ మేనేజర్‌ (లా): 'లా' డిగ్రీ పూర్తిచేసినవారు (లేదా) 5 సం|| ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు పూర్తిచేసినవారు ఈ పోస్టుకు దరఖాస్తు చేయవచ్చు. అదేవిధంగా అడ్వకేట్‌ బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం పొంది 2 సం|| ప్రాక్టీస్‌ చేసిన అడ్వకేట్లు అయివుండాలి.
(ii)అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌): బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ &కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ &టెలి కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ &ఇన్‌స్ట్రుమెంటేషన్స్‌) గ్రాడ్యుయేట్‌ అయి ఉండాలి. లేదా పైన పేర్కొన్న కోర్సుల్లో ఎంఎస్సీ పూర్తి చేసివుండాలి. ఎంసీఏ పూర్తిచేసినవారు కూడా అర్హులే.
విద్యార్హతలతో పాటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో అనుభవమున్నవారై ఉండాలి.
సన్నద్ధత ఏ రకంగా?
రీజనింగ్‌: ఇటీవలికాలంలో జరిగిన పరీక్షల్లో ఈ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంది. ప్రశ్నలు... నిడివి ఎక్కువగా ఉండి, సమాధానం గుర్తించటానికి తికమకగా ఉంటున్నాయి.
* సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌, స్టేట్‌మెంట్‌ - ఎజంప్షన్స్‌,
* ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, కోడెడ్‌- ఇనీక్వాలిటీస్‌,
* డెసిషన్‌ మేకింగ్‌, ఆర్గ్యుమెంట్స్‌, డేటా సఫిషియన్సీ
* విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
ఇందులో ప్రశ్నలన్నీ గ్రూపుగా ఉంటాయి. ప్రతీ అంశంలో 3-5 ప్రశ్నలు గ్రూపుగా వస్తాయి. ఇవే కాకుండా డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. హై-లెవెల్‌ రీజనింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. ప్రశ్నలతో దాగి ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని సమాధానాలు గుర్తించాలి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే హై-లెవెల్‌ రీజనింగ్‌ ప్రశ్నలను సులువుగా చేయవచ్చు.
డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రీజనింగ్‌ విభాగం ఉంది. ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఈ విభాగం ద్వారా ఉన్నాయి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు మాత్రమే 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా శాతాలు, లాభనష్టాలు, నిష్పత్తి-అనుపాతం, సరాసరి, కాలం-పని, కాలం-దూరం అతిముఖ్యమైనవి. వీటి మీద పూర్తి అవగాహన సాధిస్తే సగం పైగా ప్రశ్నలు పూర్తిచేయవచ్చు.
డేటా సఫిషియన్సీ, డేటా-ఎనాలిసిస్‌ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ, ఎప్రాక్సిమేషన్‌ల నుంచి 5-10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తక్కువ సమయంలో సమాధానాలు చేసేవిధంగా తయారవ్వాలి. మనసులో సూక్ష్మీకరణ పూర్తిచేసేలా సాధన చేయాలి. జవాబుకు ఎక్కువ సమయం పట్టే ప్రశ్నలు, చదివినప్పుడు అర్థం కానివీ, సమాధానం దొరకనివీ మళ్లీ చేయకూడదు. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి సమాధానం తెలిసిన ప్రశ్నలు మాత్రమే ఎన్నుకోవటం మంచిది.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రశ్నను చదివి సమయం వృథా చేయకుండా సమాధానాలు గుర్తించవచ్చు. ముఖ్యంగా వ్యాకరణం (గ్రామర్‌)పై పట్టు సాధించాలి.
* ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, ఎరర్‌ లొకేషన్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌,
* ఫ్రేజల్‌ రీప్లేస్‌మెంట్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, కోజ్‌ టెస్ట్‌...
* అతి ముఖ్యమైన అంశాలు. వీటిపై పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
వీలైనన్ని ప్రాక్టీస్‌ బిట్లు సాధన చేయటం, రోజువారీ ఇంగ్లిష్‌ దినపత్రిక చదవటం, ఆంగ్ల వార్తలు వినటం, ఇంగ్లిష్‌లో మాట్లాడటం వంటివి అలవాటు చేసుకుంటే ఎక్కువ మార్కులకు వీలుంటుంది. మౌఖిక పరీక్షను కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.
ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఇందులో వచ్చే మార్కులను మాత్రమే 'మెరిట్‌ జాబితా'లో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విభాగం నుంచి 100 మార్కులు వస్తాయి. 45 నిమిషాలలో నిడివిలో 50 ప్రశ్నలు పూర్తిచేయాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి.
డిప్యూటీ మేనేజర్‌ (లా):
గ్రాడ్యుయేషన్‌లో చదువుకొన్న కాంట్రాక్ట్‌ లా, క్రిమినల్‌ లా, జనరల్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ లా, లీగల్‌ స్కిల్స్‌, TORTలా, కాన్‌స్టిట్యూషనల్‌ &అడ్మినిస్ట్రేటివ్‌ లా, ఈక్విటీ & ట్రస్ట్‌, లాండ్‌ లా, సివిల్‌ ప్రొసీజర్స్‌ ఆఫ్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, మెడికల్‌ జురిస్‌ ప్రొడెన్స్‌, లా ఆఫ్‌ ఎవిడెన్స్‌, లీగల్‌ ఎథిక్స్‌, లీగల్‌ డ్రాఫ్టింగ్‌ &ఇంటర్‌ప్రిటేషన్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
గ్రాడ్యుయేషన్‌లో చదివిన పాఠ్యపుస్తకాలను చదువుతూ, అందులోని విషయాలను అర్థం చేసుకోవాలి. వాటి నుంచి ఆబ్జెక్టివ్‌ విధానంలో రావటానికి అవకాశం ఉన్న విషయాలనూ, ప్రశ్నలనూ నోట్సు రూపంలో తయారుచేసుకోవాలి.
అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌):
కంప్యూటర్‌ విభాగంలో ఉండే అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, C, C++, Java, డేటా స్ట్రక్చర్స్‌, డేటా బేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఇ-కామర్స్‌, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్స్‌, నెట్‌వర్క్‌, డేటా మైనింగ్‌, అసెంబ్లీ లాంగ్వేజ్‌ అంశాలపై ప్రశ్నలు రావొచ్చు.
ఎలక్ట్రానిక్స్‌ అంశాలైన డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ ఎకనామిక్స్‌, నెట్‌వర్క్‌ ఎనాలిసిస్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, బేసిక్‌ ఎలక్ట్రికల్‌ &ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌, ఎనలాగ్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌, మైక్రోప్రాసెసర్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌, డేటా కమ్యూనికేషన్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలి పరీక్షల్లో రీజనింగ్‌ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంది. ప్రశ్నలు... నిడివి ఎక్కువగా ఉండి, తికమకగా ఉంటున్నాయి. ఆంగ్లంపై పట్టు సాధిస్తే హై-లెవెల్‌ రీజనింగ్‌ ప్రశ్నలను సులువుగా చేయవచ్చు.

posted on 01-12-2015