Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ 2017-18

 • వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.9,091కోట్లు
 • గ్రామీణాభివృద్ధికి రూ.19,565కోట్లు
 • నీటిపారుదల రంగానికి రంగానికి రూ.12,770కోట్లు
 • రైతు రుణమాఫీకి రూ.3,600కోట్లు
 • పరిశ్రమల శాఖకు రూ.2,086కోట్లు
 • తెలంగాణ బడ్జెట్‌ 2017-18

 • నిర్వహణ వ్యయం రూ.61,607 కోట్లు
 • ప్రగతి పద్దు రూ.88,038 కోట్లు
 • రెవెన్యూ మిగులు అంచనా రూ.4,571 కోట్లు
 • ద్రవ్యలోటు రూ.26,096 కోట్లు
 • ఎస్సీల అభివృద్ధికి రూ.14,375కోట్లు


 • :: Union Budget 2017-18 (E.M)::

  కేంద్ర బడ్జెట్ - 2017 - 18

 • 2017 - 18 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
 • ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం. దీనికి తోడు రాజకీయ, ఆర్థిక వ్యవస్థల ప్రక్షాళన. ఆ పథాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపారు.
 • పది స్పష్టమైన భావనల కింద బడ్జెట్ ప్రతిపాదనలను పెడుతున్నట్లు జైట్లీ వెల్లడించారు.
 • 1. రైతులు: ఐదేళ్లలో వీరి ఆదాయం రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉన్నాం.
 • 2. గ్రామీణ జనాభా: ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన..
 • వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

 • వార్షికాదాయం రూ.50ల‌క్షలు అంత‌క‌న్నా ఎక్కువ ఉంటే 10శాతం స‌ర్‌ఛార్జి.
 • రూ.2.5ల‌క్షలలోపు ఆదాయ వ‌ర్గాల‌కు ప‌న్ను మిన‌హాయింపు.
 • వ్యక్తిగ‌త ఆదాయ‌ప‌న్ను: రూ.2.5ల‌క్షల నుంచి 5ల‌క్షలలోపు ఆదాయం ఉన్నవారికి 5శాతం ప‌న్ను.(ప్రస్తుతం 10శాతంగా ఉంది)
 • బడ్జెట్‌ వీక్షణం

 • రైల్వే అనుబంధ సంస్థలైన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఇర్కాన్‌లు స్టాక్‌మార్కెట్లో నమోదు.
 • డిజిటల్‌ చెల్లింపుల్ని నియంత్రించడానికి ఆర్‌బీఐలో ‘చెల్లింపుల నియంత్రణ మండలి’ (పేమెంట్స్‌ రెగ్యులేటరీ బోర్డు) ఏర్పాటు.
 • ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయినవారి ఆస్తుల్ని జప్తు చేయడానికి చట్టపరమైన మార్పులు.

 • మహిళాశిశు సంక్షేమానికి మన్నన!

  దిల్లీ: మహిళాశిశు సంక్షేమానికి కేంద్రం పెద్దపీట వేసింది. గత బడ్జెట్‌ కంటే ఈ సారి 26 శాతం నిధులను పెంచింది. గతేడాది ఈ శాఖకు రూ.17,640 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఏకంగా రూ.22,095 కోట్లు కేటాయించడం విశేషం.

  నాబార్డు ద్వారానే ప్రాజెక్టులకు సాయం

  రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న సత్వర సాగునీటి ప్రయోజన పథకానికి (ఏఐబీపీ) కేంద్రం స్వస్తి పలికింది. ఇకనుంచి జాతీయహోదా ప్రాజెక్టులు, గతంలో ఏఐబీపీ కింద, ప్రస్తుతం ప్రధానమంత్రి కృషి సించయ్‌ యోజన కింద గుర్తించిన ప్రాజెక్టులకు నాబార్డు ద్వారానే నిధులు అందుతాయి.