Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Budget - 2020

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల అంచనాతో బడ్జెట్‌ రూపొందించారు.
బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
* రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
* పెట్టుబడి వ్యయం రూ.22,061.18
* రెవెన్యూ మిగులు రూ.4,482.18 కోట్లు
* ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు
* ఆర్థిక మాంద్యం ప్రభావం, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది.
* 2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గింది.
* కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం, నిధులు సకాలంలో రావట్లేదు.
* 2018-19లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 16.1శాతం.
* కేంద్రం అరకొరగా నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 6.3శాతానికి తగ్గింది.
* 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా2.437శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది.
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,384 కోట్లు తగ్గాయి.
* ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలు రూపొందించి రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రయత్నాలు.
* ఈ మార్చినెలాఖరు వరకు రూ.లక్షా36వేల కోట్లు వ్యయం చేస్తాం.
* ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నాం.
* రైతు బంధు కోసం బడ్జెట్‌లో రూ.14వేల కోట్లు కేటాయింపునకు ప్రతిపాదన.
* కొత్త పాసుపుస్తకాల మంజూరు వల్ల రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది పెరుగుతోంది. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు అదనపు కేటాయింపులు
* రైతు ఏకారణంతో మృతి చెందినా పది రోజుల్లోనే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షల పరిహారం అందిస్తున్నాం.
* రైతు బీమా కోసం రూ.1,141 కోట్లు కేటాయింపు
* రైతులకు 2014లో రూ.16,124 కోట్లు రుణమాఫీ చేశాం. ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టాం.
* రూ.25వేల లోపు రుణాలు ఉన్న రైతులు 5,83,916 మంది. రూ.25వేల లోపు రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ చేస్తాం. దీనికోసం ఈనెలలో రూ.1,198 కోట్లు విడుదల చేస్తాం.
* రుణమాఫీ మొత్తాన్ని ప్రతీరైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతులమీదుగా అందిస్తాం.
* వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం.
* పంటల ఉత్పత్తిలో 23.7శాతం, పాడిపశువుల రంగంలో 17.3శాతం సాధించాం.
* రైతుబంధు ప్రేరణతో కేంద్రం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనను ప్రవేశపెట్టింది. రైతు బంధు తరహా పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రవేశపెట్టాయి.
* 18-60 ఏళ్ల వయసు ఉన్న ప్రతి రైతుకు బీమా సదుపాయం వర్తింపు. రైతు బీమా ప్రీమియం రూ.2,271.50 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* విత్తనాల రాయితీకోసం రూ.142 కోట్లు అందించాం.
* చేపల పెంపకంలో 8.1శాతం వృద్ధి సాధించాం.
* సేవారంగంలో 2019-20లో 14.1శాతం వృద్ధి నమోదు.
* రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహం అందిస్తోంది. పాలసేకరణ ప్రోత్సాహం ద్వారా 99,282 మంది పాడి రైతులకు లబ్ధి.
* నా తెలంగాణ కోటి రతణాల వీణ అని దాశరథి నినదించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసీఆర్‌ స్వప్నం.
* గోదావరి, కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైన్‌ చేశారు.
* బడ్జెట్‌లో సింహభాగం నిధులు నీటిపారుదల రంగానికి కేటాయింపు.
* మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రఖ్యాతి గాంచింది.
* కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతున్నాయి.
* సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాలువలు నేడు నిండుగా ప్రవహిస్తూ కళకళలాడుతున్నాయి.

బడ్జెట్‌ ప్రసంగం పూర్తి ప్రతి కోసం క్లిక్‌ చేయండి

 

Posted on 10.03.2020