Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చిరునవ్వులు చిందించే సాయం
 

‘చిరునవ్వులతో జీవితం సాగిపోవాలి’ అని కోరుకోనివారెవరుంటారు? కానీ కొందరు విద్యార్థులకు ప్రతిభ ఉన్నా సరైన ఆర్థిక వనరులుండవు. ఇలాంటి వారికి చేయూతనిస్తూ సాయం చేస్తోంది కోల్గేట్‌. కీప్‌ ఇండియా స్మైల్‌ ఫౌండేషనల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌తో ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంటర్‌ స్థాయి నుంచి పై చదువుల వారందరికీ ఆర్థిక సాయం అందిస్తోంది.

కీప్‌ ఇండియా స్మైలింగ్‌ ఫౌండేషనల్‌ ప్రోగ్రామ్‌ను కోల్గేట్‌- పామోలివ్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. ‘ప్రతి ఒక్కరికీ చిరునవ్వును చిందించే భవిష్యత్తును పొందే హక్కు ఉంది’ అనేది దీని నినాదం. ఫౌండేషనల్‌ సపోర్ట్‌ ఇవ్వడం ద్వారా ఏటా రెండు కోట్ల మందికి మంచి జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా స్కాలర్‌షిప్‌తోపాటు అవసరమైనవారికి మెంటర్‌షిప్‌, కెరియర్‌ గైడెన్స్‌ సదుపాయాలనూ అందిస్తారు. విద్యార్థులతో పాటు విద్యాపరంగా ఇతరులకు సాయపడే వారికీ వీటిని అందిస్తున్నారు.

పదకొండో తరగతి: రెండేళ్లపాటు ఇస్తారు. ఏడాదికి రూ. 20,000 చొప్పున చెల్లిస్తారు.
* 2019లో పదో తరగతి ఉత్తీర్ణులైనవారు దీనికి అర్హులు.
* పదోతరగతి బోర్డు పరీక్షల్లో 75% మార్కులు సాధించి ఉండాలి.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో పదకొండో తరగతిలో చేరి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.ఐదు లక్షలు మించకూడదు.

గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమా: మూడేళ్లపాటు ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లిస్తారు.
* 2019లో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. ్ఝ బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమాలో చేరి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. ఐదు లక్షలు మించకూడదు.

యూజీ/ ఇంజినీరింగ్‌: నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లిస్తారు.
* 2019లో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.
* బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌లో చేరి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. ఐదు లక్షలు మించకూడదు.

ఒకేషనల్‌ కోర్సులు : ఏడాది వ్యవధికి రూ.20,000 చెల్లిస్తారు.
* 2019లో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.
* బోర్డు పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
* ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఏదేని ఒకేషనల్‌ కోర్సులో చేరి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. ఐదు లక్షలు మించకూడదు.

స్పోర్ట్స్‌ పర్సన్స్‌ : మూడేళ్లపాటు ఏడాదికి రూ.75,000 చొప్పున చెల్లిస్తారు.
* దేశ/ రాష్ట్ర/ జిల్లా స్థాయిల్లో ఏదో ఒక ఆటలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు.
* జాతీయ స్థాయిలో 500లోపు గానీ, రాష్ట్ర స్థాయిలో 100లోపుగానీ, జిల్లా స్థాయిలో 10లోపుగానీ ర్యాంకు సాధించి ఉండాలి.
* కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. ఐదు లక్షలు మించకూడదు.

ఇతరులకు సాయం అందించేవారికి : రెండేళ్లపాటు ఏడాదికి రూ.75,000 చొప్పున చెల్లిస్తారు.
* నిరుపేదలైన పిల్లలకు బోధించడమో, ఆటలకు సంబంధించిన శిక్షణనో ఇస్తున్నవారు అర్హులు.
* ఆర్థికపరంగా వెనుకబడిన లేదా మధ్య తరగతికి చెందినవారై ఉండాలి.

ఎంపిక విధానం
వివిధ దశల్లో ఎంపిక చేస్తారు. దరఖాస్తుల నుంచి అర్హులైనవారిని గుర్తించి, సంస్థ ప్రతినిధులు నేరుగా సంప్రదిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫేస్‌బుక్‌, గూగుల్‌+, ఈమెయిల్‌లలో ఒకదానితో రిజిస్టర్‌ చేసుకోవచ్చు. ఫీజు ఏమీ లేదు. కేటగిరీని బట్టి సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోగ్రాఫ్‌, ఐడీ ప్రూఫ్‌, ఆదాయ సర్టిఫికెట్‌, మార్కుల షీట్లు, బోనఫైడ్‌/ అడ్మిషన్‌ లెటర్‌ మొదలైనవి ఇందులో భాగంగా ఉంటాయి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జనవరి 30, 2020.
వెబ్‌సైట‌: https://www.colgatecares.co.in/keepindiasmiling/get-started.html

Posted on 27-08-2019