Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
బ్యాంకు ఉద్యోగాల కటాఫ్‌ ఏపీలో 147.25
 

* తెలంగాణలో ఈ మార్కులు 143.25
* ఏపీలో ఒక ఉద్యోగానికి 73 మంది.. తెలంగాణలో 59 మంది పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకు ఉద్యోగాల్లో (ఐబీపీఎస్‌) క్లర్క్‌ పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌లో జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కులు 147.25గా నమోదయ్యాయి. క్లర్క్‌ ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌ అనంతరం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు జరిగింది. ఈ మార్కులను వందకు కుదిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జనరల్‌ కేటగిరి (అన్‌రిజర్వుడు)లో 73.63 కటాఫ్‌ వచ్చింది. తెలంగాణలో జనరల్‌ కేటగిరిలో 71.63 కటాఫ్‌ నమోదైంది. ఏపీలో 1283, తెలంగాణలో 878 క్లర్క్‌ ఉద్యోగాల్ని భర్తీచేస్తున్నారు. ఏపీలో సగటున ఒక్కో పోస్టుకు 73 మంది చొప్పున మొత్తం 90,325 మంది పోటీపడ్డారు. తెలంగాణలో ఒక్కో పోస్టుకు 59 మంది చొప్పున 51,860 మంది పోటీపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్లర్క్‌ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష లేదు. ఈ ఉద్యోగాల భర్తీ రాష్ట్రాల వారీగా జరుగుతోంది. ఫలితాల ఆధారంగా ఈ ఉద్యోగాల పోటీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ తొలి ఐదు స్థానాల్లో, తెలంగాణ తొలి పది స్థానాల్లో ఉన్నాయి. కటాఫ్‌ మార్కుల పరిశీలన ద్వారా ఈ విషయం స్పష్టమైంది.
పీవో పోస్టులకు: ప్రొబేషనరీ ఆఫీసర్ల ఎంపికకు మెయిన్స్‌ రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహించారు. ఇందులో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి 100 మార్కులకు మౌఖిక పరీక్ష జరిపారు. మొయిన్స్‌లో వచ్చిన మార్కుల్ని 80కి, మౌఖిక పరీక్షలో వచ్చిన మార్కుల్ని 20కి కుదించి అభ్యర్థుల్ని ఎంపికచేశారు. దీని ప్రకారం జనరల్‌ కేటగిరిలో కటాఫ్‌ 49.90 నమోదైంది. ఓబీసీ విభాగంలో 46.70, ఎస్సీల్లో 41.40, ఎస్టీల్లో 36.30 మార్కుల కటాఫ్‌ నమోదైంది.
* క్లర్క్‌ పోస్టులకు దేశవ్యాప్తంగా కటాఫ్‌ మార్కుల వివరాలు


posted on 03-04-2016