Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా కోర్సు
 

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులో ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆధ్వర్యంలో న‌డుస్తోంది. ప్యాకేజింగ్‌లో దేశంలో ప్రసిద్ధ సంస్థ ఇదే. దీనికి హైద‌రాబాద్‌, దిల్లీ, కోల్‌క‌తా, ముంబ‌యిల్లో క్యాంప‌స్‌లు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో పీజీడీ కోర్సు పూర్తిచేసుకున్నవారు ఎమ్మెన్సీలు, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ఇండ‌స్ట్రీ, ఫార్మా...త‌దిత‌ర చోట్ల అవ‌కాశాలు పొంద‌వ‌చ్చు.

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్‌
వ్యవ‌ధి: రెండేళ్లు
అర్హత‌: మ‌్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మైక్రోబ‌యాల‌జీల్లో ఏదో ఒక స‌బ్జెక్టును డిగ్రీలో చ‌దివుండాలి లేదా అగ్రిక‌ల్చర్‌, ఫుడ్ సైన్స్‌, ప్రింటింగ్ టెక్నాల‌జీ, ఫార్మా, ఇంజినీరింగ్ టెక్నాల‌జీ వీటిలో ఏదైనా కోర్సులో క‌నీసం ద్వితీయ శ్రేణితో ఉత్తీర్ణత సాధించాలి.
క్యాంప‌స్‌ల వారీ సీట్లు: హైద‌రాబాద్‌లో 60, ముంబైలో 80, దిల్లీలో 100, కోల్‌క‌తాలో 60 చొప్పున సీట్లు ఉన్నాయి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష ద్వారా
ప‌రీక్ష తేదీ: జూన్ 18
ప‌రీక్ష కేంద్రాలు: ఐఐపీ- హైద‌రాబాద్‌, ముంబ‌యి, దిల్లీ, చెన్నై, కోల్‌క‌తా.
ద‌ర‌ఖాస్తులు: ఐఐపీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివరి తేదీ: జూన్ 14, 2015
వెబ్‌సైట్‌: www.iip-in.com

Notification

posted on 11-6-2015