Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఐఐటీలో సమ్మర్‌ ఫెలోషిప్‌
 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే 2020కిగానూ ఫ్రీ/ లిబర్‌ అండ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ) సమ్మర్‌ ఫెలోషిప్‌లను అందిస్తోంది. ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ కింది ప్రాజెక్టు. అన్ని విభాగాలవారూ, బ్యాచిలర్‌, మాస్టర్స్‌, పీహెచ్‌డీ మొదలైన పట్టాలున్నవారూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఏమీలేదు. ఫెలోషిప్‌ను పొందడానికి అభ్యర్థులు దరఖాస్తుతోపాటుగా స్క్రీనింగ్‌ టాస్క్‌నూ పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిని పూర్తిచేయడానికి నెలకుపైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అంశాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అభ్యర్థులు రెండు టాపిక్‌ల వరకూ ఎంచుకునే వీలుంది. టాస్క్‌ పూర్తిచేసిన తర్వాత గడువులోగా వెబ్‌సైట్‌లో సమర్పించాలి. వీటిని ఎఫ్‌ఓఎస్‌ఎస్‌ఈఈ బృందం పరిశీలిస్తుంది. ఉత్తమంగా చేసినవారిని ఎంపికచేసి, ఫెలోషిప్‌ అవకాశం కల్పిస్తారు. స్క్రీనింగ్‌ టాస్క్‌ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఇదివరకే సమ్మర్‌ ఫెలోషిప్‌లో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

నమోదు చేసుకోవడానికి చివరితేదీ: ఫిబ్రవరి 25, 2020

దరఖాస్తు సమర్పించడానికి చివరితేదీ: మార్చి 07, 2020

ఫలితాలు: ఏప్రిల్‌ 2020 చివర్లోగా వెలువడతాయి.

వెబ్‌సైట్‌: https://fossee.in/fellowship/2020


Posted on 11-02-2020