Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎన్ఐఎఫ్‌టీఈఎంలో ఫుడ్ టెక్నాల‌జీ కోర్సులు
 

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాల‌జీ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్‌ మేనేజ్‌మెంట్ (ఎన్ఐఎఫ్‌టీఈఎం) ఫుడ్ టెక్నాల‌జీలో అండ‌ర్ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాల‌జీలో ప్రపంచ స్థాయి విద్య అందించే ల‌క్ష్యంతో ఈ సంస్థను వంద ఎక‌రాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల పెట్టుబ‌డితో దిల్లీకి సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ నెల‌కొల్పింది. దీన్ని యూజీసీ డీమ్డ్ యూనివ‌ర్సిటీగా గుర్తించింది. ఇక్కడి కోర్సుల‌కు ఆఖిల భార‌త సాంకేతిక విద్యామండ‌లి (ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది. నాణ్యమైన ఫ్యాక‌ల్టీ, అధునాత‌న ల్యాబ్‌, లైబ్రరీ, ప్రఖ్యాత విదేశీ విద్యా సంస్థల‌తో ఒప్పందాలు, స్థానిక ప‌రిశ్రమ‌ల‌తో అవ‌గాహ‌న మొద‌లైన ప్రత్యేక‌త‌లెన్నో ఈ సంస్థకు ఉన్నాయి. ఎన్ఐఎఫ్‌టీఈఎంలో ప్రతిభావంతులైన విద్యార్థులను విదేశీ సంస్థల‌కు అధ్యయ‌నం నిమిత్తం పంపుతారు.

కోర్సులు...
ఫుడ్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌లో నాలుగేళ్ల బీటెక్‌
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
ఎంపిక‌: జేఈఈ మెయిన్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎంపిక‌చేస్తారు.
సీట్లు: 180

పోస్టు గ్రాడ్యుయేష‌న్ (ఎంటెక్)
ఫుడ్ స‌ప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌
ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌
ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌
ఫుడ్ ప్లాంట్ ఆప‌రేష‌న్స్ మేనేజ్‌మెంట్
ఫుడ్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌
ఒక్కో కోర్సు వ్యవ‌ధి రెండేళ్లు
సీట్లు: ప‌్రతి ప్రొగ్రాంలో 18 చొప్పున ఉన్నాయి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా. ఇదిలేనివారు నిఫ్టెమ్ నిర్వహించే రాత ప‌రీక్షకు హాజ‌రుకావాలి.

పీహెచ్‌డీ కోర్సులు
అగ్రిక‌ల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్సెస్‌
బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌
ఫుడ్ ఇంజినీరింగ్‌
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ
ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంట‌ర్ ప్రెన్యూర్‌షిప్ డెవ‌ల‌ప్‌మెంట్‌
అర్హత‌: స‌ంబంధిత విభాగంలో ఎంటెక్‌
ఎంపిక విధానం: రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ప‌రీక్ష ద్వారా
సీట్లు: అయిదు విభాగాల్లోనూ క‌లిపి 20 ఉన్నాయి. ఒక్కో విభాగంలో నెట్ అర్హుల‌కు అద‌నంగా రెండేసి చొప్పున సీట్లు.

ప్రత్యేక‌త‌లు: బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరిన మెరిట్ విద్యార్థుల‌కు ట్యూష‌న్ ఫీజు ర‌ద్దుచేస్తారు. ప్రతినెలా స్టైపెండ్ చెల్లిస్తారు. పీహెచ్‌డీలో చేరిన నెట్ అర్హుల‌కు ప్రతి నెలా మొద‌టి ఏడాది రూ.16,000; రెండో ఏట రూ.18,000; మూడో సంవ‌త్సరం రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. నెట్ లేనివారికి ప్రతినెలా రూ.12,000 చొప్పున అందిస్తారు.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో ల‌భిస్తాయి
వెబ్‌సైట్‌: www.niftem.ac.in
బీటెక్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జూన్ 19, 2015
ఎంటెక్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: జూన్ 24, 2015

కెరీర్‌
ప్రస్తుతం ఆహార ప‌రిశ్రమ బాగా విస్తరిస్తోంది. ఇన్‌స్టెంట్‌, రెడీమేడ్ ఫుడ్ కు ప్రాధాన్యం పెరిగింది. ఈ రంగంలో ప‌లు కంపెనీలు కొత్తగా చేరుతున్నాయి. ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారుచేసి వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డానికి సంస్థలు పోటీ ప‌డుతున్నాయి. భార‌త్ నుంచి ఆహార ఉత్పత్తులు విదేశాల‌కూ ఎగుమ‌తి అవుతున్నాయి. దీంతో ఈ రంగంలో నాణ్యమైన మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం ఏర్పడింది. ఐటీసీ, బ్రిటానియా, పార్లే...లాంటి కార్పొరేట్ దిగ్గజాల‌తోపాటు ప‌లు స్థానిక వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారుచేస్తున్నాయి. ప్రస్తుతం బ‌హుళ‌జాతి శీత‌ల‌పానీయ త‌యారీ సంస్థలైన పెప్సి, కోక్‌లు కూడా ఆహార‌ప‌దార్థాల‌ను త‌యారుచేస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్‌...త‌దిత‌ర సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఫుడ్ టెక్నాల‌జీ కోర్సులు చ‌దివిన‌వారికి అవ‌కాశాలు ల‌భిస్తాయి. కార్పొరేట్ హోట‌ళ్లతోపాటు చిన్నచిన్న ఫుడ్ చెయిన్స్‌లోనూ ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు. ఎన్ఐఎఫ్‌టీఈఎంలో ఫుడ్ టెక్నాల‌జీ కోర్సులు చ‌దివిన‌వారికి కెరీర్ ప‌రంగా తిరుగులేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఇక్కడి విద్యార్థుల‌కు వంద‌శాతం ప్లేస్‌మెంట్స్ ద‌క్కడ‌మే దీనికి నిద‌ర్శనం.

హోదాలు
ఫుడ్ ప్రాసెస్ ఇంజినీర్‌
ఫుడ్ ఇంగ్రిడియంట్ మేనేజ‌ర్‌
ఫుడ్ రెగ్యులేట‌రీ స్పెష‌లిస్ట్‌
న్యూట్రిష‌న్ స్పెష‌లిస్ట్‌
ఫుడ్ పెర్మెంటేష‌న్ స్పెష‌లిస్ట్‌
రిటైల్‌/ స‌ప్లై చైన్ మేనేజ‌ర్‌
ఫుడ్ ఎంట‌ర్‌ప్రన్యూర్‌
ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సైంటిస్ట్‌
సెన్సరీ సైంటిస్ట్‌
ఫుడ్ మైక్రోబ‌యాల‌జిస్ట్‌
ఫుడ్ ఎన‌లిస్ట్‌
క్వాలిటీ కంట్రోల్ సూప‌ర్‌వైజ‌ర్‌
Notification

posted on 3-6-2015