Latest News

21 నుంచి ఏపీ ఎస్సై దారుఢ్య పరీక్షలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జ‌న‌వ‌రి 21 నుంచి శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ జ‌న‌వ‌రి 9న‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబ‌రు 12న సివిల్‌ ఎస్సై, ఏఆర్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష జరిగిన సంగతి విదితమే. దీనిలో 51,926 మంది అభ్యరులు అర్హత సాధించారు. వీరికే శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Posted on 10-01-2019