తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో తొలి దశ అయిన ప్రిలిమ్స్ ముగిసింది; శారీరక దృఢత్వ పరీక్షలకు రంగం సిద్ధమవుతోంది. ఆపై జరిగే మెయిన్స్ చాలా ముఖ్యం. దీనిలో నెగ్గాలంటే మూస విధానం పనికిరాదు. వివిధ అంశాలను సమకాలీన సామాజిక అంశాలతో పోల్చి చదవాలి. ఈ తరహాలో ఇప్పటినుంచే సన్నద్ధత ఆరంభిస్తే విజయ పథంలో కొనసాగుతున్నట్టే!