TS Police Constables Notification

టీఎస్ పోలీస్‌: 17156 కానిస్టేబుల్, 1272 ఎస్సై పోస్టులు

- ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు

హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ వివిధ విభాగాల్లో 18,428 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల భ‌ర్తీకి మే 31న (గురువారం) ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది. వీటిలో 17156 ఉద్యోగాలు కానిస్టేబుళ్లు కాగా.. 1272 ఎస్సై పోస్టులు ఉన్నాయి.

కానిస్టుబుల్ పోస్టుల‌కు సంబంధించి విభాగాల‌వారీ ఖాళీలు ఇలా ఉన్నాయి...
సివిల్‌: 5909, ఏఆర్‌: 5273, ఎస్ ఏ ఆర్ సీపీఎల్:53, టీఎస్ ఎస్ పీ: 4816, ఎస్ పీ ఎఫ్‌: 485, ఫైర్ స‌ర్వీస్: 168, వార్డ‌ర్స్ (మేల్‌): 186, వార్డ‌ర్స్ ( ఫిమేల్‌): 35, ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌: 142, మెకానిక్స్ (ట్రాన్స్ పోర్ట్‌) : 19, డ్రైవ‌ర్స్‌: 70
విద్యార్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌కు నిబంధ‌ల మేర‌కు అర్హ‌త‌లు అవ‌స‌రం. ఎస్టీ అభ్య‌ర్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి ఇంట‌ర్ రెండేళ్ల ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైతే స‌రిపోతుంది.
వ‌య‌సు: పై అన్ని పోస్టుల‌కు జులై 1, 2018 నాటికి 18 - 22 ఏళ్ల‌లోపు ఉండాలి. అంటే జులై 2, 1996 కంటే ముందు, జులై 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వారు అన‌ర్హులు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు 21-25 ఏళ్ల‌లోపు వారు అర్హులు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.400, మిగిలిన అంద‌రికీ రూ.800

ఎస్సై పోస్టుల ఖాళీల వివ‌రాలు:
సివిల్: 710, ఏఆర్‌: 275, ఎస్ ఏ ఆర్ సీపీఎల్‌: 5, రిజ‌ర్వ్: 175, రిజ‌ర్వ్ (15వ బెటాలియ‌న్‌): 16, ఫైర్ స‌ర్వీస్: 19, డిప్యూటీ జైల‌ర్‌: 15, అసిస్టెంట్ మ్యాట్ర‌న్‌: 2, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్‌: 29, ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో: 26

విద్యార్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఎస్టీ అభ్య‌ర్థులైతే ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌తోపాటు క‌నీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చ‌దివితే స‌రిపోతుంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్ పోస్టుల‌కు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్‌/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త ఉండాలి. ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో పోస్టుల‌కు కంప్యూట‌ర్ సైన్స్ / ఐటీ/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటొలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి.

వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 21 నుంచి 25 ఏళ్ల‌లోపు ఉండాలి. ఫైర్ స‌ర్వీస్‌, డిప్యూటీ జైల‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్ల‌లోపువారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.500. మిగిలిన అంద‌రికీ రూ.1000.

Posted on 31-5-2018