Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంటర్‌ విద్యార్థినులకు సంతూర్‌ సాయం!
 

ఆడపిల్లల చదువులకు ఎన్నో అడ్డంకులు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థినులు ఆర్థిక పరిస్థితుల వల్ల ఎంత ప్రతిభ, ఆసక్తి ఉన్నా ఉన్నతవిద్యకు వెళ్లలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకొని, ఆసరా ఇవ్వాలనే లక్ష్యంతో సంతూర్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది.

సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రస్తుతం వారు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు ఉన్నప్పటికీ బాల్యంలోనే కొంతమంది బాలికలు చదువులకు దూరం అవుతున్నారు. అందుకు ప్రధానమైన కారణం ఆర్థిక పరిస్థితి. దాన్ని అధిగమించి వారికి ఆసరా కల్పించేందుకు విప్రో సంస్థ ఉపకార వేతనం అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది.

గ్రామీణప్రాంతాల్లో ఆడపిల్లల చదువులకు అనేక అడ్డంకులు...బాల్య వివాహాలు, పేదరికం, చదువుకునే ఆసక్తి ఉన్నా తగిన ప్రోత్సాహం లేకపోవడం వంటివి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి విద్యాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా వీటిపై సరైన అవగాహన లేక ఎంతోమంది బాలికలు చదువు కొనసాగించలేకపోతున్నారు. వారికి ఆర్థికంగా చేయూతనందించే లక్ష్యంతో విప్రో సంస్థ ‘సంతూర్‌ విమెన్‌ స్కాలర్‌షిప్‌’ పేరుతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన బాలికలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్‌ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.

అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివిన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పేద బాలికలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2018-19 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ పూర్తిచేసిన వారు, 2019-20లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్‌ వివరాలు
ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్ల పాటు ప్రతినెలా రూ. రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని అందజేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత ఎటువంటి ఉన్నత విద్యను చదవాలనుకున్నా ఈ స్కాలర్‌షిప్‌ ఇస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. అప్లికేషన్‌కు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు పంపేందుకు చివరితేది: ఆగస్టు 15

మరిన్ని వివరాలను విప్రో కేర్స్‌ - సంతూర్‌ స్కాలర్‌షిప్‌, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక చిరునామాలో లేదా www.santoorscholarships.com/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

Posted on 17-07-2019