Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారా?
 

భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లోని వివిధ స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలయింది. డెవలపర్‌, టెక్నాలజీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, టెస్టర్‌, టెస్ట్‌ లీడ్‌, మేనేజర్‌ (స్టాటిస్టిషియన్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌, స్టాటిస్టిషియన్‌) పోస్టులతోపాటు కాంట్రాక్ట్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేయదల్చిన అభ్యర్థులు అక్టోబరు 31 లోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష నవంబరు 25న జరుగుతుంది..Read more


ఎస్‌బీఐలో 180 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు
 

- ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ, ఎంసీఏ గ్రాడ్యుయేట్లకు అవ‌కాశం

దేశంలో అతిపెద్ద ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్‌బీఐ 180 అసిస్టెంట్ మేనేజ‌ర్(సిస్టమ్‌) పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. నిర్దేశిత బ్రాంచ్‌ల్లో ఇంజినీరింగ్‌, ఎమ్మెస్సీ లేదా ఎంసీఏ విద్యార్థులు ఈ ప‌రీక్షకు అర్హులు. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఈ పోస్టులు బ్యాంక్ పీవో హోదాతో స‌మాన‌మైన‌వి. పీవో ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష మాదిరిగానే ఈ ప‌రీక్ష ఉంటుంది. అద‌నంగా ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ ఉండ‌దు. ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

పోస్టు: అసిస్టెంట్ మేనేజ‌ర్ (సిస్టమ్‌)
ఖాళీలు: 180 (జ‌న‌ర‌ల్ 92, ఓబీసీ 48, ఎస్సీ 27, ఎస్టీ 13)
వ‌యోప‌రిమితి: సెప్టెంబ‌రు 1, 2016 నాటికి 21-30 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)
అర్హత‌: బీఈ/ బీటెక్ లేదా ఎమ్మెస్సీలో కంప్యూట‌ర్ సైన్స్‌/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌/ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ లేదా ఎంసీఏ. కంప్యూట‌ర్ ప్రొగ్రామింగ్‌లో అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్యం.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా

రాత‌ప‌రీక్షలో:
రీజ‌నింగ్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం ప్రశ్నప‌త్రానికి 120 మార్కులు. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. ఇందులో అర్హత సాధిస్తే స‌రిపోతుంది. ఈ అంశాల్లో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. వీటితోపాటు ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్‌కు సంబంధించి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున వీటికి వంద మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో సాధించిన మార్కులు తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. రీజ‌నింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ల్లో నిర్ణీత క‌టాఫ్ మార్కులు సాధించాలి. అలాగే ఈ మూడు అంశాల్లో క‌లిపి కూడా నిర్దేశిత క‌టాఫ్ మార్కులు పొందాలి. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ పేప‌ర్లను మూల్యాంక‌నం చేస్తారు. ఇందులోనూ బ్యాంక్ నిర్ణయించిన క‌టాఫ్ మార్కులు సాధిస్తే ఇంట‌ర్వ్యూకు ఆహ్వానిస్తారు. తుది ఎంపిక‌లో ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్‌, ఇంట‌ర్వ్యూ మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

ఎంపికైతే:
ప్రారంభ వేత‌న శ్రేణి రూ.23700-42020తో మొద‌ల‌వుతుంది. ఎంపికైన‌వాళ్లు అన్ని ర‌కాల ఆల‌వెన్సులూ క‌లుపుకుని ఏడాదికి రూ.11.63 ల‌క్షల వ‌ర‌కు వేత‌నంగా పొందవ‌చ్చు. ప‌నిచేస్తోన్న ప్రాంతాన్ని బ‌ట్టి జీతంలో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.వంద‌. మిగిలిన అంద‌రికీ రూ.600
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్లకు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 31
హాల్‌టికెట్ల ల‌భ్యం: న‌వంబ‌రు 15 నుంచి
ఆన్‌లైన్ ప‌రీక్ష తేదీ: న‌వంబ‌రు 25
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌
వెబ్‌సైట్‌: www.sbi.co.in

అప్లై ఆన్‌లైన్‌

నోటిఫికేష‌న్‌

posted on 06-10-2016