Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారా?
 

భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లోని వివిధ స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలయింది. డెవలపర్‌, టెక్నాలజీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, టెస్టర్‌, టెస్ట్‌ లీడ్‌, మేనేజర్‌ (స్టాటిస్టిషియన్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (సిస్టమ్స్‌, స్టాటిస్టిషియన్‌) పోస్టులతోపాటు కాంట్రాక్ట్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేయదల్చిన అభ్యర్థులు అక్టోబరు 31 లోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష నవంబరు 25న జరుగుతుంది.

ఎంపిక ప్రక్రియ
పోస్టుల ఎంపిక రెండు అంచెలుగా జరుగుతుంది. మొదట అభ్యర్థులు రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారికి మౌఖిక పరీక్ష నిర్వహించి, అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తారు.
రాతపరీక్షలో వివిధ విభాగాల నుంచి 170 ప్రశ్నలుంటాయి. వీటికి జవాబులను 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో రాయటం పూర్తిచేయాలి.

ఏ విభాగంలో ఎలా?
రీజనింగ్‌: ఈ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు. లాజికల్‌, అనలిటికల్‌, రీజనింగ్‌ ప్రశ్నలు వస్తాయి. హైలెవల్‌ రీజనింగ్‌ ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన SBI- PO మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలను గమనిస్తే మంచిది. ప్రశ్నల సరళి మారింది కాబట్టి జులై నెలలో జరిగిన SBI- PO మెయిన్స్‌ పరీక్ష ప్రశ్నపత్రం గమనించడం ప్రయోజనకరం. సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, ఇన్ఫరెన్సెస్‌, కోర్స్‌ ఆఫ్‌ యాక్షన్‌, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌ అంశాలను ప్రిపేర్‌ అవ్వాలి. కచ్చితమైన సమాధానాలతో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను పూర్తిచేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో 35 ప్రశ్నలకు 35 మార్కులు కేటాయించారు. అప్రాక్సిమేషన్‌, న్యూమరికల్‌ ఎబిలిటీల నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. నంబర్‌ సిరీస్‌/ డబుల్‌ నంబర్‌ సిరీస్‌ లేదా రాంగ్‌ నంబర్‌ సిరీస్‌ నుంచి 5 ప్రశ్నలు, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్‌ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ అంశాలైన శాతాలు, లాభనష్టాలు, నిష్పత్తి, సరాసరి, కాలం- పని, కాలం- దూరం, LCM & HCF, ప్రాబబులిటీ వంటి అంశాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. డేటా అనాలిసిస్‌/ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సాధన చేస్తే సింప్లికేషన్‌ను తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చు. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను సాధన చేస్తే మంచిది.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: ఈ విభాగం నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అతి ముఖ్యమైన అంశాలు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, క్లోజ్‌ టెస్ట్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌ అంశాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. పఠన నైపుణ్యాలు (రీడింగ్‌ స్కిల్స్‌) ఉన్న అభ్యర్థులు ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఇంగ్లిష్‌ విభాగంలోని ప్రశ్నలుంటాయి. ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, ఆర్టికల్స్‌, ప్రిపోజిషన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌ నుంచి 10 మార్కులు వస్తాయి. ఆంగ్లం మీద పట్టు సాధిస్తే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
ప్రతిరోజూ దినపత్రికను చదువుతూ, ఆంగ్లంలో వార్తలు వినడం, మాట్లాడటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. 45 నిమిషాలలో 50 ప్రశ్నలను పూర్తిచేయాలి. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ విభాగాలలో క్వాలిఫైయింగ్‌ మార్కులు మాత్రమే పరిగణిస్తారు. ఫైనల్‌ మెరిట్‌ మార్కులలో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌లోని మార్కులు మాత్రమే పరిగణిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎక్కువ మార్కులు పొందేలా సన్నద్ధత కొనసాగించాలి.
అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో పూర్తిచేసిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రాడ్యుయేషన్‌లో ఉన్న ముఖ్యమైన సబ్జెక్టు పుస్తకాలలోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని సంసిద్ధత కొనసాగించాలి.
రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: www.sbi.co.in

అప్లై ఆన్‌లైన్‌

నోటిఫికేష‌న్‌

Back..

posted on 10-10-2016