SBI POs - Notification

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 పీవో పోస్టులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- దేశంలోని శాఖల్లో పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* పీవో (ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌): 2000 పోస్టులు (ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ-540, జ‌న‌ర‌ల్‌-1010)
అర్హత‌: ఏదైనా డిగ్రీ. డిగ్రీ చివ‌రి సంవ‌త్సరం/ సెమిస్టర్ చ‌దువుతున్నారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోడానికి అర్హులు.
వ‌య‌సు: 01.04.2018 నాటికి 21 - 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల గ‌రిష్ఠ వ‌య‌సు మిన‌హాయింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఆన్‌లైన్ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌- అనంత‌పురం, చీరాల‌, చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజ‌మ‌హేంద్రవ‌రం, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
తెలంగాణ‌- హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగల్‌.

మెయిన్ ప‌రీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌- గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం.
తెలంగాణ‌- హైద‌రాబాద్‌.

ముఖ్యమైన తేదీలు....
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.04.2018.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 13.05.2018.
* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (ప్రిలిమిన‌రీ ప‌రీక్ష): 18.06.2018 నుంచి
* ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేది: జులై 01, 07, 08 తేదీల్లో
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: 15.07.2018.
* కాల్ లెట‌ర్‌ డౌన్‌లోడ్ (మెయిన్‌ ప‌రీక్ష): 20.07.2018 నుంచి.
* ఆన్‌లైన్ మెయిన్‌ ప‌రీక్ష తేది: 04.08.2018.
* మెయిన్‌ ప‌రీక్ష ఫ‌లితాలు: 20.08.2018.
* ఇంట‌ర్వ్యూ కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌: 01.09.2018.
* గ్రూప్ డిస్కష‌న్‌, ఇంట‌ర్వ్యూ తేది: 24.09.2018 నుంచి 12.10.2018 వ‌ర‌కు.
* తుది ఫ‌లితాలు: 01.11.2018.

Posted on 21-04-2018