SBI Specialist Officers - Notification

ఎస్‌‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు

* ఏడాదికి వేతనం 15-52 లక్షలు!

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ భారీ వేతనాలను అందించే స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. స్టాటిస్టిక్స్‌, ఇంజినీరింగ్‌, న్యాయవిద్యల్లో తదితరాల్లో పట్టాలు పొందిన అనుభవజ్ఞులైన అభ్యర్థులకు రూ. 15 లక్షల నుంచి రూ. 52 లక్షల వరకు వార్షిక వేతనాన్ని ఇవ్వనుంది. ఇంటర్య్వూలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.

భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ప్రకటించిన 31 స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అర్హతలూ, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు దరఖాస్తులను పంపుకోవాల్సివుంటుంది.
ఈ స్పెషలిస్ట్‌ క్యాడర్‌ పోస్టులకు ఎంపికైతే ఆకర్షణీయమైన వార్షిక వేతనం లభిస్తుంది.
* హెడ్‌ (లీగల్‌) ఉద్యోగానికి రూ.47 లక్షల నుంచి 52 లక్షలు
* డీజీఎం పోస్టుకు రూ. 35 లక్షల నుంచి రూ.47 లక్షలు
* మేనేజర్‌ పోస్టుకు రూ. 18 లక్షలు ‌
* స్టాటిస్టిషియన్‌ పోస్టుకు రూ. 15 లక్షలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేయటంతోపాటు సంబంధిత డాక్యుమెంట్ల కాపీలను ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

ఏ పోస్టులు ఎన్ని?
డిప్యూటీ మేనేజర్‌ (స్టాటిస్టిషియన్‌) -2
ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌ మేనేజర్‌- అగ్రికల్చర్‌/ఇంటర్నేషనల్‌ బ్యాకింగ్‌/రీటెయిల్‌/కార్పొరేట్‌ బ్యాంకింగ్‌- 3
మేనేజర్‌ (సర్వీసింగ్‌-డిజిటల్‌)- 3
మేనేజర్‌ (బిజినెస్‌ అనలిస్ట్‌/కస్టమర్‌ సర్వీస్‌ అనలిస్ట్‌) - 3
మేనేజర్‌ (ఆన్‌లైన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌/ఇంటిగ్రేషన్‌ అండ్‌ జర్నీ/సూపర్‌స్టోర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌)- 3
మేనేజర్‌ (డిజిటల్‌ మార్కెటింగ్‌- 4
హెడ్‌ (లీగల్‌)- 1, డీజీఎం (ఎన్‌సీఎల్‌టీ)-1
డీజీఎం (లా)-1, ఎగ్జిక్యూటివ్‌ (క్రెడిట్‌ మానిటరింగ్‌)-10
హెడ్‌ (ప్రొడక్ట్‌, ఇన్వెస్టిమెంట్ అండ్‌ రిసెర్చి) -1
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, పీజీ, బీఈ, సీఏ, అనుభవం.
ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీలకు రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: జనవరి 31.

Notification Website

Posted on 10-01-2019