Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మెడికల్‌ కోర్సులకు టాటా ఉపకారం!
 

చాలా కాలం నుంచి సమాజాభివృద్ధికి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల్లో టాటా ట్రస్ట్స్‌ ఒకటి. ప్రజల ప్రాథమిక అవసరమైన వైద్య రంగంలోకి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలను అందిస్తోంది. రకరకాల కోర్సులకు సంబంధించి ఎనభై శాతం వరకు ఫీజులను చెల్లిస్తోంది.

ఆసక్తి ఉన్నా వైద్య విద్యా కోర్సులు చదవడానికి చాలామంది వెనకడుగేస్తారు. మిగతా డిగ్రీలతో పోలిస్తే వీటిలో చేరడానికి భారీమొత్తంలో ఖర్చవడమే కారణం. అందుకే సైన్స్‌ దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘టాటా ట్రస్ట్స్‌’ ఉపకార వేతనాలను అందిస్తోంది. ఎంపికైనవారికి 30 నుంచి 80 శాతం ఫీజులను చెల్లిస్తారు!

ఎవరి కోసం: హెల్త్‌కేర్‌, మెడికల్‌ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లను పొందవచ్చు. గుర్తింపు పొందిన విద్యా సంస్థలో, డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తిచేసినవారు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో చేరినవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.

దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ట్యూషన్‌ ఫీజు, ఇతర విద్యా సంబంధమైన ఫీజులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. చదువుతున్న కోర్సు వివరాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను స్కైప్‌లో ఇంటర్వ్యూ చేస్తారు.

ఏయే కోర్సులకు..
బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిలో 65 శాతం, బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ 75 శాతం, బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటిస్ట్రీ 75 శాతం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ 75 శాతం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ 75 శాతం, ఎంబీబీఎస్‌ 75 శాతం, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీలో 80 శాతం మార్కులు పొంది ఉండాలి. పీజీ కోర్సుల్లో ఎంఎస్సీ ఇన్‌ బయోటెక్నాలజీ 65 శాతం, ఎంఎస్సీ ఇన్‌ మైక్రోబయాలజీ 65 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ 70 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ 75 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ 70 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ డెంటిస్ట్రీ 70 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ హోమియోపతి 70 శాతం, ఫార్మసీలో 80 శాతం, డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో 70 శాతం, మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీలో 70 శాతం, ఎంసీహెచ్‌లో 70 శాతం మార్కులు పొంది ఉండాలి.

చివరి తేదీ: 6.11.2019

వెబ్‌సైట్‌: https://tatatrusts.goodera.com

Posted on 30-10-2019