Ask the Expert
|
Feed Back
|
About us
|
Contant us
|
Pratibha Home
 

* ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి
* పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సూచనలు
* ‘ఈనాడు’ ఫోన్ ఇన్ కి అపూర్వ స్పందన    
రోజూ ఏకాగ్రతతో చదువుతున్నా ఏదో ఆందోళన, పట్టుదలతో సాధన చేస్తున్నా వెంటాడే సంశయం...వీటికి తోడు ఈ ఏడాది కొత్త సిలబస్. మదిని తొలుస్తున్న ప్రశ్నలు అనేకం. పరీక్షలకు సన్నద్ధమవుతూ పునశ్చరణలో నిమగ్నమైన పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిత్యం పరీక్షే. ఇంకా మెరుగైన గ్రేడ్ సాధించాలంటే ఏం చేయాలి, ఎక్కడ దృష్టి సారించాలి.. లోపాల్ని గుర్తించి ఎలా అధిగమించాలి.. ఇలాంటి సందేహాలతో ఉన్న విద్యార్థులు మార్చి 5న ‘ఈనాడు’ నిర్వహించిన ఫోన్ ఇన్‌ను వినియోగించుకొన్నారు. ఈ ఏడాది గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 61,457 మంది పరీక్షలకు హాజరవుతుండగా... ఈ కార్యక్రమానికి వందలాది మంది ఫోన్లు చేసి అనుమానాలను నివృత్తి చేసుకొన్నారు. ఆయా సబ్జెక్టు నిపుణుల సూచనలు పొందారు.
* మాతృభాష.. ఉత్తీర్ణత సులభం : ఎ. విశాలాక్షి, తెలుగు ఉపాధ్యాయురాలు, ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల, గుంటూరు.
? రామాయణం మీద ఎలాంటి ప్రశ్నలు చదవాలి? ఫణి, రేపల్లె, నయిమిషా, బాపట్ల, చంటికుమార్, ఉప్పలపాడు.
జ: రాముడు, తాటకి, విభీషణుడు, కైక, మంథర వంటి పాత్రల స్వభావాలను చదవాలి. రాముడు తండ్రి మాటను జవదాటకుండా అడవులకు వెళ్లడం అనే సందర్భంలో మీరుంటే ఏమి చేస్తారు? శూర్పణక స్వభావం? ఆంజనేయుడు ఏవిధంగా సీతను తీసుకొని రావడంలో సహాయం చేశాడు? సీత స్వయంవరం జరిగిన విధానం, శ్రీరాముడు శివధనస్సును విరిచిన విధానం వీటిని బాగా చదవాలి.
? అక్షర దోషాలకు మార్కులు తగ్గుతాయా? గోపితేజ నాయక్, వినుకొండ, కుమార్ కౌషిక్, కొత్తపేట, షేక్ ముజామిల్, మాచర్ల, గాయిత్రి, నరసరావుపేట.
జ: వీలైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా వాక్యం అర్థం మారకూడదు. చిన్న చిన్న అక్షర దోషాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.
? పేపర్-2లో గ్రాంథికంలో ఇచ్చిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు రాయాలి? శ్రీహర్ష, మిట్టపాలెం
జ: గ్రాంథికంలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు రోజువారీ మాట్లాడే భాషలో వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు దమము, శమము లేని జపతపాలు ఏల? అనే దానికి దమం, శమం లేని జపతపాలెందుకు అని రాస్తే సరిపోతుంది.
? అలంకారాలను ఎలా గుర్తించాలి? రాజేష్, వేమూరు, రహీనా, అమరావతి, వంశీకృష్ణ, గుంటూరు.
జ: పోలికైతే ఉపమ, ఆరోపిస్తే రూపకం, ఊహిస్తే ఉత్పేక్ష్ర, ఎక్కువ చెప్తే అతిశయోక్తి, పాదాల చివర ఒకే అక్షరాలు ఉంటే అంత్యానుప్రాసమని గుర్తుంచుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఇచ్చిన వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి.
? ఏ పాఠాలను బాగా చదవాలి? శివరామకృష్ణ, ఆర్టీసీ కాలనీ, శ్రావ్య, బాపట్ల
జ: 1, 2, 3, 4, 9, 13, 14 పాఠాలను
? ప్రతి పదార్థాలు, కంఠస్థ పద్యాలకు ఏఏ పాఠాలు ముఖ్యమైనవి? కీర్తన, తెనాలి, అలేఖ్య, పిన్నెల్లి, మాచర్ల మండలం, మానస, మాచర్ల, సాయి, తెనాలి.
జ: 1, 3, 5, 13 పాఠాల్లోని నక్షత్ర గుర్తు ఉన్న పద్యాలను చదవాలి. ప్రతి పదార్థంలో ప్రతి పదానికి అర్థంతోపాటు తాత్పర్యం రాయాలి. కంఠస్థ పద్యం విషయంలో అక్షర దోషాలు, పాదభంగం లేకుండా చూసుకోవాలి.
* బొమ్మలే స్కోరింగ్‌కు జీవం : వి.నాగేశ్వరరావు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, జడ్పీ ఉన్నత పాఠశాల, ఏటుకూరు.
? నాలుగు మార్కుల ప్రశ్నలు, బొమ్మలు ఏయే పాఠ్యాంశాల నుంచి వస్తాయి. - పూజిత, సత్తెనపల్లి
జ: నాలుగు మార్కుల ప్రశ్నలు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది పాఠ్యాంశాల నుంచి వచ్చేందుకు అవకాశాలున్నాయి. 1-5 పాఠాల వరకు ఒక బొమ్మ, ఆరో పాఠంలో ఒక బొమ్మ, వచ్చే అవకాశం ఉంది.
? ప్రశ్నపత్రంలో వెయిటేజ్ ఎలా ఉంటుంది. - మణిధర్, రేపల్లె, మౌనిక పెదకూరపాడు.
జ: ప్రశ్నలు రూపొందించడంలో అన్ని పాఠాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తారు.
? రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలు ఏయే పాఠ్యాంశాల నుంచి వస్తాయి. రియాజ్, ఆర్టీసీ కాలనీ, శివరామకృష్ణ, ఆర్టీసీ కాలనీ
జ: పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, మన పర్యావరణం-మన బాధ్యత, అనువంశికత అనే పాఠ్యాంశాల నుంచి వచ్చే అవకాశాలున్నాయి.
? జైలం, ఫ్లోయం అంటే ఏమిటి?- సాయికృష్ణ, చిలకలూరిపేట శ్రీరామ్, బృందావన్ గార్డెన్స్, సంజయ్, బాపట్ల
జ: వేరు నుంచి నీటిని గ్రహించి అన్ని భాగాలకు సరఫరా చేసే సంక్లిష్ట కణజాలన్నీ దారువు (జైలం) అని, ఆకుల్లో తయారైన ఆహార పదార్థలను వేరుకి, కాండానికి, ఫలాలకు అందజేసే కణజాలన్నీ పోషక కణజాలం లేదా ఫ్లోయం అంటారు.
? బయాలజీలో ఏయే పటాలను నేర్చుకోవాలి. హృష్ణ, వినుకొండ, సుధ - నందివెలుగు రోడ్డు, జగదీష్, ఏటుకూర్
జ: ఆకు అడ్డుకోత, మైటోకాండ్రియా, హరితరేణువు, మూత్రపిండం అడ్డుకోత, మానవ స్త్రీ/పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, ఉమ్మెత్త పుష్పం నిలువుకోత పటాలను నేర్చుకోవాలి.
? ఏయే పాఠ్యాంశాలు ఎక్కువ చదవాలి? అత్యధిక మార్కులు సాధించాలంటే ఎలా చదవాలి? - గోపీచంద్, లక్ష్మీపురం, కిరణ్‌కుమార్ పిడుగురాళ్ళ.
జ: 1-6 పాఠాలు, ఎనిమిది, పది పాఠ్యాంశాలలో ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది.
? పర్యావరణానికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వస్తాయి. - లిఖిత, చెరుకుపల్లి, మల్లికార్జున్, శారదాకాలనీ, శ్రీరామ్, కృష్ణనగర్
జ: మన పర్యావరణం నుంచి అయిదు మార్కులు వస్తాయి. రెండు మార్కుల ప్రశ్న ఒకటి, ఒక మార్కు ప్రశ్న ఒకటి, అర మార్కుల ఖాళీలు నాలుగు వస్తాయి
* సొంత వాక్యాలు.. సమకాలీన అంశాలే అస్త్రాలు : జి. వసుంధరదేవి, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు, ప్రభుత్వ బాలిక‌ల ఉన్నత పాఠశాల, గుంటూరు.
? పటాలను ఎలా గుర్తించాలి? షేక్ బషీరున్నీషా, పెదపరిమి
జ: ప్రపంచ పటంలో ఒక్కో ఖండాన్ని ముందుగా సాధన చేయాలి. భారతదేశ పటంలో రాష్ట్రాలు, రాజధానులు, నదులు, పర్వతాలు సాధన చేయాలి. ముఖ్యంగా 1, 2, 4, 5, 13, 14, 17 (చాప్టర్లను) సాధన చేయాలి
? బహుళ్త్లెచ్ఛిక ప్రశ్నలను ఎలా చదవాలి - సాయితేజ, తెనాలి, రోషన్, గుంటూరు
జ: పాఠ్యభాగాలలోని ముఖ్యమైన అంశాలను నోట్స్ రాసి చదవాలి
? గత సంవత్సర ప్రశ్న పత్రానికి ఈ సంవత్సరం ప్రశ్నపత్రానికి తేడా ఉంటుందా. -బాషా, గుంటూరు, హరిత కనిగిరి, సంజయ్, బాపట్ల
జ: ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించిన ప్రీ-ఫైనల్ ప్రశ్న పత్రంలాగే ఉంటుంది.
? 10/10 గ్రేడ్ సాధించాలంటే ఏ విధంగా చదవాలి. -రిజ్వాన్అహ్మద్, వినుకొండ, నాగవెంకటేష్ ఏటుకూరు
జ: పాఠ్యంశంలోని కీలక భావనలు విద్యార్థులు అర్థం చేసుకోని సొంత అభిప్రాయాలను, సమకాలీన విషయాలను కలుపుతూ విశ్లేషించి రాస్తే 10/10గ్రేడ్ సాధించొచ్చు.
* కె. నాగేశ్వరరావు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉర్దూ బాలుర‌ ఉన్నత పాఠశాల, గుంటూరు.
? భౌతిక, రసాయన శాస్త్రంలో ముఖ్యమైన పాఠ్యాంశాలు ఏవి చదవాలి ? శౌరి తెనాలి, శ్రీరామ్, కీర్తన, రాజేష్ కనపర్తి, సుబ్రమణ్యం యడ్లపాడు, వేఘన కనిగిరి, సాయి రాఘవేంద్ర గుంటూరు.
జ: భౌతికశాస్త్రంలో ఉష్ణం, కన్ను రంగుల ప్రపంచం, ప్రవాహ విద్యుత్తు, విద్యుత్ అయస్కాంత ప్రేరణ చదవాలి. రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, లోహ సంగ్రహణ శాస్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు ముఖ్యంగా చదవుకోవాలి.
? ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి ? స్వాతి, జాహ్నవి వినుకొండ, భవ్యశ్రీ గుంటూరు.
జ: జవాబులు అన్నీ పాయింట్‌వైజ్‌గా రాసుకోవాలి. ఛాయిస్ వదలకుండా రాస్తే బాగుంటుంది. నాలుగు మార్కుల ప్రశ్నకు పటములు ఉన్నట్లయితే వాటిని కూడా గీయాలి.
? రెండు మార్కులు ప్రశ్నలు వేటి నుంచి ఇస్తారు ? తేజశ్వీ మారుతీనగర్, నర్సింగ్ గుంటూరు.
జ: క్రాంతి వక్రీభవనం, మూలకాలు ఆవర్తన పట్టిక, రసాయనిక చర్యలు సమీకరణాలు, ఆమ్లాలు క్షారాలు, కాంతి పరావర్తనాల నుంచి రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వాటిని బాగా సాధన చేయాలి.
? ఏ విద్యా ప్రమాణాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావచ్చు? శ్రీహర్ష మిట్టపాలెం, ప్రవీణ్ పాతగుంటూరు, మోహిత్ కొరిటెపాడు.
జ: విషయ అవగాహన (ఎఎస్-1), అభినందించడం, విలువలు పాటించడం (ఎఎస్-6), నిజజీవిత వినియోగం (ఎఎస్-7)ల నుంచి ఎక్కువ ప్రశ్నలుండవచ్చు.
? ఏ పాఠ్యాంశం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు? బానుచందర్ తాడేపల్లి, షాజియా బాపట్ల, అరవింద్ పొన్నూరు.
జ: ఉష్ణం-7, రసాయనికచర్యలు, సమీకరణాలు-7, కాంతిపరావర్తనం-7, ఆమ్లాలు క్షారాలు-4, కాంతి వక్రీభవనం-2, వక్రతాలల వద్ద కాంతి వక్రీభవనం-2, కన్ను రంగుల ప్రపంచం-7, పరమాణు నిర్మాణం-6, మూలకాలు వర్గీకరణ-3, రసాయనబంధం-4, విద్యుత్తు ప్రవాహం-6, విద్యుత్తు అయస్కాంతత్వం-7, లోహ సంగ్రహణశాస్త్రం-6, కర్బన సమ్మేళనశాస్త్రం-9 మార్కులు ఇవ్వవచ్చు.
? ఏ పాఠ్యాంశం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు? బానుచందర్ తాడేపల్లి, షాజియా బాపట్ల, అరవింద్ పొన్నూరు.
జ: ఉష్ణం-7, రసాయనికచర్యలు, సమీకరణాలు-7, కాంతిపరావర్తనం-7, ఆమ్లాలు క్షారాలు-4, కాంతి వక్రీభవనం-2, వక్రతాలల వద్ద కాంతి వక్రీభవనం-2, కన్ను రంగుల ప్రపంచం-7, పరమాణు నిర్మాణం-6, మూలకాలు వర్గీకరణ-3, రసాయనబంధం-4, విద్యుత్తు ప్రవాహం-6, విద్యుత్తు అయస్కాంతత్వం-7, లోహ సంగ్రహణశాస్త్రం-6, కర్బన సమ్మేళనశాస్త్రం-9 మార్కులు ఇవ్వవచ్చు.
* దస్తూరి తెస్తుంది మార్కుల్ని : షేక్ జిలానీ బాషా, హిందీ ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల, గుంటూరు.
? ప్రశ్నపత్రంలో ఏ ఏ వ్యాసాలు ఇస్తారు. ఎలా రాస్తే పూర్తి మార్కులు పొందొచ్చు? -పృధ్వీరాజ్, రాజీవ్‌గాంధీనగర్, ఫణి, రేపల్లె.
జ: మంచి దస్తూరితో ప్రస్తావన, విషయ ప్రవేష్, విషయ విస్తారణ్, ఉపసంహార్ లాంటి విభిన్న ఉపశీర్షికలతో వ్యాసం రాయాల్సి ఉంటుంది. ముఖ్యమైన అంశాల కింద పెన్సిల్‌తో అండర్‌లైన్ చేస్తే మంచిది. ముఖ్యంగా వ్యాసాలలో దూరదర్శన్, కంప్యూటర్, ప్రియత్యోహార్, పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్, రాష్ట్ర భాష హిందీ, స్వచ్ఛభారత్, వృక్షో కా మహత్వ్, యథీ మై ప్రధాన్ మంత్రీ హోథా, హరియాలీ-సఫాయి, లాభ్ లాంటి వ్యాసాలు అడిగేందుకు అవకాశం ఉంది.
? మూడు మార్కులకు ఏ ఏ పద్యాలు చదవాలి.-కేశవ్, అయ్యప్పనగర్, రోజారాణి, వినుకొండ, ప్రసన్నకుమార్, మాచర్ల
జ: నీతి దోహే నుంచి అడిగే అవకాశం ఎక్కువ.
* ఆందోళన వద్దే వద్దు : శ్రీనివాస్, ఆంగ్ల ఉపాధ్యాయులు, వట్టి చెరుకూరు.
? నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయా? ఎందులో నుంచి వస్తాయి? - షణ్ముకరాం(వినుకొండ), అనూష(గుంటూరు).
జ: ఆంగ్లం పేపర్‌లో నాలుగు మార్కుల ప్రశ్నలు లేవు. పేపర్-1 రెండు మార్కుల ప్రశ్నలు, పేపర్-2లో ఒక మార్కు ప్రశ్న వస్తుంది.
? పేపర్-1, -2లో ప్రశ్నలు ఏఏ పాఠ్యాంశాల నుంచి వస్తాయి? - దీక్షిత(చిలకలూరిపేట), మానస (మాచర్ల).
జ: పేపర్-1లో రీడింగ్ ప్యాసేజ్ ఎ, బి నుంచి పది ప్రశ్నలు వస్తాయి. 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పేపర్-2లో రీడింగ్ ప్యాసేజె సి నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ఐదింటికి జవాబు రాయాలి
? పరీక్షల్లో చేతి రాత ఎలా ఉండాలి? - ముంతాజ్(వినుకొండ), అలేఖ్య(పిన్నిల్లి), సుధాకర్, రాజేష్, కిరణ్(తెనాలి).
జ: కర్సివ్ రైటింగ్, ప్రింట్ రైటింగ్ ఇలా రెండు రకాలుంటాయి. వీటిలో ఏది రాసినా ప్రతీ పదం స్పస్టంగా ఉండాలి.
? మార్కులు ఎలా స్కోర్ చేసుకోవచ్చు? 10కి 10 జీపీఏ రావాలంటే ఎలా? - విశ్వసాయి(తుళ్ళూరు), కీర్తన, సంధ్య(బొల్లాపల్లి).
జ: మోడల్ ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ రెండు పేపర్లు కలిపి 35 మార్కులొస్తాయి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే 35కి 35 మార్కులు వస్తాయి. పేపర్-1 పార్టు-బి 30 మార్కులకు ఉంటుంది. వీటిని కూడా ఎక్కువగా చదివితే మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. పేపర్-2 పార్టు-ఎ లోని డిస్కోర్స్ రైటింగ్ 20 మార్కులకు ఉంటుంది.
? గ్రామర్ టెక్ట్స్ నుంచి వస్తుందా? - వల్లి(లక్ష్మీపురం), కీర్తన (గుంటూరు).
జ: ఎక్కువగా గ్రామర్ జనరల్ పార్టు నుంచే వస్తుంది. టెక్ట్స్‌వల్ ఒకాబులరీ ఎక్సర్‌సైజస్(ఫ్రేజెస్, ఇడియమ్స్, మీనింగ్స్) అభ్యసించాలి. ఇదేవిధంగా రీడింగ్ కాప్రెహెన్షన్ ప్యాసేజెస్ 20 మార్కులకే టెక్ట్స్ నుంచి 15 మార్కులకు జనరల్ పార్టు నుంచి వస్తుంది.
* నిరంతర సాధనతోనే పట్టు: వి. పద్మజ, గణిత ఉపాధ్యాయురాలు, గుంటూరు.
? పదోతరగతి గణితంలో ఐదు మార్కుల ప్రశ్నలు ఏం ఇస్తారు. ఎలా సాధన చేయాలి? - నవ్య, శ్రావణి అద్దంకి, పూజిత మొక్కపాడు.
జ: పేపర్-1లో బహుపదులు నుంచి రెండు, చరరాశులు రేఖీయ సమీకరణాల నుంచి రెండు గ్రాఫ్‌లు వస్తాయి. ఒక్కటి చేయాల్సి ఉంటుంది. పేపర్-2లో సరూప త్రిభుజాల నుంచి నిర్మాణాలు.. సరళరేఖా ఖండాన్ని ఇచ్చిన నిష్పత్తిలో విభజించడం, సరూప త్రిభుజాలను అనురూప భుజాల నిష్పత్తిలో ఉండునట్లు నిర్మించుట ఈరెండింటిలో ఒకటి తప్పకుండ ఇచ్చే అవకాశం ఉంది. త్రికోణమితి అనువర్తనాల ఉంచి ఒక ప్రశ్న ఇస్తారు. వీటి నుంచి ఒకదానికి తప్పకుండ సమాధానం రాయాల్సి ఉంది.
? గణితంలో పూర్తిగా వంద మార్కులు సాధించేందుకు ఎలా సాధన చేయాలి ? - భవ్యశ్రీ బ్రాడీపేట, జాహ్నవి వినుకొండ.
జ: గణితంలో వందకు వంద మార్కులు సాధించేందుకు పాఠ్యాంశంలో ఉన్న అన్ని అధ్యాయాల్లో ప్రశ్నలపై క్షుణ్నంగా అవగాహన కలిగి ఉండాలి. బిట్‌లకు సంబంధించి అన్ని నమూనా ప్రశ్నాపత్రాలు, ఎ.పి.ఆర్.జె.సి., పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలల్లో ఇచ్చిన బిట్స్‌ను బాగా సాధన చేసుకోవాలి. నిర్మాణాల నుంచి 5 మార్కులు తప్పకుండా ఇస్తారు కాబట్టి ప్రత్యేక దృష్టితో సాధన చేయాలి. అన్ని అధ్యాయాల్లోని నాలుగు మార్కుల ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
? పదోతరగతి సిలబస్‌లో విద్యార్థుల సామర్థ్యానికి మించిన గణిత అంశాలు ఉంటున్నాయి. వాటిని పరీక్షల్లో ఇస్తారా?. ఎలా సాధన చేయాలి.? - శివశంకర్ రింగురోడ్డు.
జ: సిలబస్‌లో ఉన్న అన్నిగణిత అంశాలు పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని అధ్యాయాల్లో విద్యార్థుల స్థాయికి మించినవి ఉన్నాయనేది వాస్తవం. వీటిని కూడా తప్పకుండా సాధన చేసి నేర్చుకోవాలి. సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
? సరూప త్రిభుజాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాలు, వర్గ సమీకరణల ఛాప్టర్లు కష్టంగా ఉంటున్నాయి. ఎలా సాధన చేయాలి.? - రాకేష్ కండ్లకుంట, పృధ్విరాజ్ రాజీవ్‌గాంధీనగర్, పవన్‌కల్యాణ్ తెనాలి, కృష్ణవేణి ఎర్రబాలెం.
జ: సరూప త్రిభుజాల్లో సిద్ధాంతాలు, క్షేత్రమితిలో సూత్రాలు బాగా క్షుణ్నంగా నేర్చుకోవాలి. త్రికోణమితి అనువర్తనాల్లో నాలుగు మార్కుల లెక్కలు, వర్గసమీకరణలు రెండు మార్కుల లెక్కలు ఎక్కువ సార్లు సాధన చేయాలి.
? పేపర్- 1, 2ల్లో బిట్ పేపర్‌కు సమయం వృథా కాకుండ చూసుకోవడం ఎలా?. ఎలా సాధన చేయాలి.? - గాయత్రి నరసరావుపేట, రాజేష్ కనపర్రు, షహనాజ్ వినుకొండ.
జ: పేపర్-1, 2లలో బిట్ పేపర్ 15 మార్కుల చొప్పున ఉంటుంది. ప్రతి పేపర్‌కు 30 నిమిషాల సమయం ఇస్తారు. బిట్స్ పేపర్‌లో మంచి మార్కులు సాధించేందుకు పరీక్షల్లో నిర్ధేశించిన సమయం 30 నిమిషాలు సమయం కేటాయించుకుని సాధన చేయాలి.
* ఎంత చక్కగా రాసినా ప్రశ్న నెంబరు నమోదు చేయకపోతే ఆ సమాధానం పరిగణలోకి రాకుండాపోయే అవకాశముంది.
* ప్రశ్న సమాధానాలు, ఒకటికి రెండు సార్లు సొంతంగా నోట్స్ రాసుకుంటూ ఉంటే ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే వేగంగా స్పందించే అవకాశముంటుంది.
* పరీక్ష రాయడం పూర్తి అయ్యాక ఒక్కసారి మొత్తం సమాధానాలు పరిశీలించుకుంటే చాలా మంచిది.

posted on 06.03.2015