Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఏపీలో పెరిగిన ఇంజినీరింగ్‌ ఫీజులివీ..

     ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులను ప్రభుత్వం పెంచింది. ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సుల మేరకు 41 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్య కార్యదర్శి సుమితా దావ్రా మే 2న ఉత్తర్వులు జారీ చేశారు. తాజా సవరణతో మదనపల్లిలోని మదనపల్లి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఫీజు రూ.79,000గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత చంద్రగిరిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏడాది ఫీజు రూ.74,900గా ఖరారైంది.

posted on 03.05.2015;">