Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
శాస్త్రవేత్తల ఎంపికకు పరీక్ష

వ్యవసాయ, అనుబంధ పరిశోధన సంస్థల్లో నియామకం పొందే అవకాశం! నూతన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపిక, వారికి శిక్షణ ఇప్పించటానికి దోహదపడే పరీక్షల ప్రకటన వెలువడింది. వీటి గురించి తెలుసుకుందాం...
       దేశంలో 70% ప్రజల జీవనానికి ఆధారభూతమైన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత వ్యవసాయ శాస్త్రవేత్తల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) ఏర్పడింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), హరిత విప్లవ పిత డా. ఎంఎస్‌ స్వామినాథన్‌ల నేతృత్వంలో 42 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు. దీని ద్వారా నూతన వ్యవసాయ శాస్త్రవేత్తలను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇప్పించి, వివిధ వ్యవసాయ- అనుబంధ పరిశోధన సంస్థల్లో నియమిస్తారు. ఈవిధంగా సంవత్సరంలో రెండుసార్లు ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
కానీ ఈ సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రవేశపరీక్ష పెడుతున్నారు. పరీక్ష విధానంలో కూడా మార్పులు, చేర్పులు చేశారు.
ఈ పరీక్ష రాయాలంటే విద్యార్థులు వ్యవసాయ, అనుబంధ సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీ చేసుండాలి. అది కూడా ఐసీఏఆర్‌/ యూజీసీ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాల్లో.
నెట్‌- 2015లో కనీస అర్హత మార్కులు
* జనరల్‌ 45%
* ఓబీసీ (నాన్‌ క్రీమీలేయర్‌) 40%
* ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీహెచ్‌ 35%
ఈ పరీక్ష అర్హత పొందితే నెట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఇది దేశంలోవున్న వివిధ విశ్వవిద్యాలయాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామక ఇంటర్వ్యూలకు తప్పనిసరి.
2. ఏఆర్‌ఎస్‌- 2015 (మెయిన్‌ పేపర్‌): 240 మార్కులు (సమయం- 3 గం.)
* పరీక్ష మొత్తం రాత పరీక్ష ద్వారానే ఉంటుంది.
* ఈ పేపర్‌ను మొత్తం 3 విభాగాలుగా విభజిస్తారు.
పార్ట్‌-ఎ: 40 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు
* జవాబులు పది పదాలకు మించకూడదు.
పార్ట్‌-బి: 20 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు
* జవాబులు ఒకటి లేదా రెండు పేరాగ్రాఫ్‌లకు మించకూడదు.
పార్ట్‌-సి: 6 ప్రశ్నలు- ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు
* జవాబులు ఒక పేజీ/ కేటాయించిన స్థలంలోనే రాయాలి.
* రాయడానికి వేరే అదనపు (అడిషనల్‌) పేపర్‌ ఇవ్వరు.
3. ఏఆర్‌ఎస్‌- 2015 (వైవా- ఓకల్‌)- 60 మార్కులు
పై రెండు పరీక్షల్లో అర్హులైనవారినే ఈ వైవాకు ఎంపిక చేస్తారు. సాధారణంగా ఈ వైవాలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వాటి ఉత్పత్తుల గణాంకాలు, వాటి ప్రాముఖ్యం, వివిధ పంటల నూతన సాగు పద్ధతులు, గ్లోబలైజేషన్‌, పాలీహౌజ్‌ టెక్నాలజీ, ఆయా విభాగాల్లో వచ్చిన నూతన పరిశోధనలు మొదలైన అంశాలపై ప్రశ్నలను అడుగుతుంటారు.
అంతేకాకుండా పలు కోణాల్లో ప్రశ్నలు సంధించి, విద్యార్థి సామర్థ్యాన్ని లెక్కిస్తారు.
రెండు పరీక్షల్లో అర్హులైనవారినే వైవాకు ఎంపిక చేస్తారు. దీనిలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, వాటి ఉత్పత్తుల గణాంకాలు, వివిధ పంటల నూతన సాగు పద్ధతులు, గ్లోబలైజేషన్‌, పాలీహౌజ్‌ టెక్నాలజీ, ఆయా విభాగాల్లో వచ్చిన నూతన పరిశోధనలు మొదలైనవాటిపై ప్రశ్నలు అడుగుతారు.
ప్రయత్నాల సంఖ్య
* నెట్‌ను ఐదు సార్లు మాత్రమే రాసే అనుమతి ఉంది.
* ఏఆర్‌ఎస్‌ను మాత్రం ఆరు సార్లు రాసే అనుమతి ఉంది.
* ఓబీసీ/ వికలాంగులు 9 సార్లు రాయవచ్చు. కానీ ఎస్‌సీ/ ఎస్‌టీలు మాత్రం ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
* ఈ ప్రయత్నాలు అనేవి పరీక్ష రాస్తేనే కానీ దరఖాస్తు చేసినంతమాత్రాన లెక్కలోకి తీసుకోరు. ఈ ప్రయత్నాలు 2012 సంవత్సరం తరువాత రాసిన పరీక్షలకు మాత్రమే. అంతకుముందు రాసిన పరీక్షలను లెక్కలోకి తీసుకోరు.
* ఈ పరీక్షలో ఎంపికైనవారికి మళ్లీ తరువాతిసారి పరీక్ష రాయడానికి అనుమతినివ్వరు.
వయః పరిమితి: నెట్‌ (ప్రిలిమినరీ) పరీక్షకు వయః పరిమితి లేదు. కానీ ఏఆర్‌ఎస్‌ (మెయిన్‌ పేపర్‌) 31 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు.
పరీక్ష విధానం
ఈ పరీక్షను పైన పేర్కొన్న డిగ్రీల్లోని విభాగాల వారీగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది.
1. ఏఆర్‌ఎస్‌ (ప్రిలిమినరీ/ నెట్‌-2015): ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఉంటుంది. దీనిలో మొత్తం 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు రుణాత్మక మార్కులుంటాయి. దీన్ని గమనించి, సరిగా జవాబు గుర్తించాలి.
ఈ పరీక్ష ప్రధాన పేపర్‌ (మెయిన్‌ పేపర్‌) ప్రవేశానికి మాత్రమే. దీనిలో వచ్చిన మార్కులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.
ఈ పరీక్షలో అర్హత పొందితే ప్రధాన పేపర్‌ పరీక్షకు 1:15 నిష్పత్తిలో అర్హులుగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీలు
నెట్‌- 2015 (ప్రిలిమినరీ)- 4.12.2015 నుంచి 10.12.2015 (ఎంపిక చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో)
ఏఆర్‌ఎస్‌- 2015 (మెయిన్‌)- 21.02.2106
Viva-voce తర్వాత తెలియజేస్తారు.
ఈ పై పరీక్షల ద్వారా ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (NAARM) లో శిక్షణ ఇచ్చి, ఐసీఏఆర్‌ కిందనున్న జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా నియమిస్తారు.
ఈ పరీక్షల్లో నెట్‌కు మాత్రమే అర్హత పొందినవారు దేశంలో ఉన్న వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో గానీ, మరే ఇతర విశ్వవిద్యాలయాల్లో గానీ జరిగే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ శాస్త్రవేత్తల నియామకంలో జరిగే ఇంటర్‌వ్యూలకు అర్హులవుతారు.
పరీక్షకు దరఖాస్తు చేసేటపుడు విద్యార్థులు జాగ్రత్తగా నెట్‌ మాత్రమే/ ఏఆర్‌ఎస్‌ మాత్రమే/ నెట్‌+ ఏఆర్‌ఎస్‌ రెండూ... ఇలా ఎంపిక చేసుకోవాలి. ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తుపత్రాన్ని ప్రింట్‌ చేసుకుని, జాగ్రత్తగా Viva-voce వరకూ భద్రపరచుకోవాలి.
ఈ పరీక్ష రాయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ను కేటాయించారు. సిలబస్‌, పోస్టుల ఖాళీలు, పరీక్ష ఫీజు, పరీక్ష కేంద్రాలు మొదలైన అంశాలకు http://www.asrb.org.in ను చూడవచ్చు.

Published on 26-10-2015