Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మేటి భవితకు బయో పీజీ

* ఉమ్మడి ప్రవేశపరీక్షకు ప్రకటన

‘బయోటెక్నాలజీ’ అనే పదం చాలామందికి కొత్త కాదు. కానీ దాని ప్రతి అడుగూ కొత్తదనం వైపే! మనిషికి వచ్చే వ్యాధులను నయం చేసే యాంటీబయాటిక్స్‌ నుంచి ఆ మనిషినే కృత్రిమంగా సృష్టించి అందరినీ అబ్బురపరిచే సామర్థ్యం దీని సొంతం. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలతో ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారికోసం యూనివర్సిటీ, కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (సీఈఈబీ) ప్రకటన విడుదలైంది.

బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 1986లోనే అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీని ఏర్పాటు చేశారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. ప్రతి ఏడాదీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ తరఫున సీఈఈబీ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా వివిధ కోర్సులకు 54 యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తాయి.

యూనివర్సిటీలు అందించే కోర్సులు- అర్హతలు:
1. ఎంఎస్సీ బయోటెక్నాలజీ: ఈ కోర్సును 33 యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
అర్హత: ఫిజికల్, బయోలాజికల్, అగ్రికల్చరల్, వెటర్నరీ అండ్‌ ఫిషరీ సైన్సెస్, ఫార్మసీ, ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఎస్సీ (ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ కోర్సు) లేదా మెడిసిన్‌ (ఎంబీబీఎస్‌) లేదా బీడీఎస్‌లో ఉత్తీర్ణత.

2. ఎంఎస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ: ఈ కోర్సును 11 యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
అర్హత: అగ్రికల్చర్, వెటర్నరీ సైన్సెస్, హార్టీకల్చర్‌/ ఫారెస్ట్రీ విభాగాల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌/ బయోటెక్నాలజీలో/ జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

3. ఎంవీఎస్‌సీ (మాస్టర్స్‌ ఇన్‌ వెటర్నరీ సైన్సెస్‌): ఈ కోర్సును 3 యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
అర్హత: యూనివర్సిటీకి తగిన విధంగా అగ్రికల్చర్, వెటర్నరీ సైన్సెస్, హార్టీకల్చర్‌/ ఫారెస్ట్రీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బయోటెక్నాలజీలో/ జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ/ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

4. ఎంటెక్‌ బయోటెక్నాలజీ: ఈ కోర్సును 07 యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
అర్హత: కెమికల్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ తదితర విభాగాల్లో బీఫార్మసీ లేదా బీటెక్‌/ బీఈ ఉత్తీర్ణత. (లేదా) బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రో బయాలజీ తదితర విభాగాల్లో ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు యూజీ విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. ప్రిలిమినరీ దశలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మెరిట్‌ ఆధారంగా కళాశాలలు ఎంచుకోవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సును యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ - హైదరాబాద్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం- తిరుపతి అందిస్తున్నాయి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది: ఏప్రిల్‌ 15
ఫీజు చెల్లించడానికి చివరితేది: ఏప్రిల్‌ 16
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: మే 27 నుంచి మే 31 వరకు.


Back..

Posted on 15-04-2019