Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీడ్‌తో డిజైన్ కోర్సులు

అన్ని కోర్సుల్లాగానే డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికీ ప్రత్యేక ప‌రీక్షలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది కామ‌న్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ ఫ‌ర్ డిజైన్ (సీడ్‌). ఈ ప‌రీక్ష ద్వారా ఐఐఎస్సీ బెంగ‌ళూరు, ఐఐటీ-బాంబే, దిల్లీ, గువాహ‌టి, హైద‌రాబాద్‌, కాన్పూర్‌ల్లో డిజైన్‌కు సంబంధించి పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం ల‌భిస్తుంది. ఏటా ప‌రీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది. తాజాగా సీడ్ ప్రక‌ట‌న వెలువ‌డింది. ప‌రీక్షకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ప‌రీక్షను జ‌న‌వ‌రి 20, 2018 (శ‌నివారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఇందులో 2 పార్ట్‌లు ఉంటాయి. అవి పార్ట్ ఎ, బి. అభ్యర్థులు రెండు విభాగాల్లోని ప్రశ్నల‌కూ జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. పార్ట్ ఎ లో మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పార్ట్-ఎ ప్రశ్నల‌కు ఆన్‌లైన్‌లోనే స‌మాధానాలు గుర్తించాలి. పార్ట్‌-బి ప్రశ్నలు కంప్యూట‌ర్‌లో ఉంటాయి. అయితే వీటికి స‌మాధానాలు (డ్రాయింగ్స్‌) మాత్రం బుక్‌లెట్‌పై రాయాలి. పార్ట్‌-ఎలో ఎన్విరాన్‌మెంట‌ల్‌, సోష‌ల్ అవేర్‌నెస్‌, ఎన‌లిటిక‌ల్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, లాంగ్వేజ్‌, అబ్జ‌ర్వేష‌న్‌...అంశాల్లో ప్రశ్నలు వ‌స్తాయి. పార్ట్ బిలో డిజైన్లు, డ్రాయింగ్, రైటింగ్ స్కిల్స్‌పై వివ‌రణాత్మక ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ ఎ వ్యవ‌ధి ఒక గంట‌, పార్ట్ బి వ్యవ‌ధి 2 గంట‌లు. పార్ట్ ఎ ను స్క్రీనింగ్ టెస్టుగా ప‌రిగ‌ణిస్తారు. పార్ట్ ఎ ప‌రీక్షలోని ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల‌ను షార్ట్‌లిస్టు చేస్తారు. వీళ్ల పార్ట్ బి స‌మాధానాలు మూల్యాంక‌నం చేస్తారు. ఫ‌లితాలు జ‌న‌వ‌రి 27న ప్రక‌టిస్తారు.

అర్హత‌: బీటెక్, బీఆర్క్‌, డిజైన్‌, ఇంటీరియ‌ర్ డిజైన్‌, బీఎఫ్ఏ వీటిలో ఏదైనా నాలుగేళ్ల కోర్సు లేదా జీడీ ఆర్ట్స్ డిప్లొమా ప్రొగ్రాం (10+5 ఇయ‌ర్స్‌) చ‌దివిన‌వాళ్లు సీడ్ ప‌రీక్షకు అర్హులు.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం: అక్టోబ‌రు 9, 2017
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 10
ఆల‌స్య రుసుముతో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 17
ద‌ర‌ఖాస్తు ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు రూ.1100. మిగిలిన అంద‌రు అభ్యర్థుల‌కు రూ.2200 + జీఎస్‌టీ
అడ్మిట్ కార్డులు: డిసెంబ‌రు 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు
ప‌రీక్ష: జ‌న‌వ‌రి 20, 2018
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రం: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 27, 2018
వెబ్‌సైట్‌: www.gate.iitb.ac.in/ceed2018

సంస్థల‌వారీ కోర్సులు / స్పెష‌లైజేష‌న్లు
ఐఐఎస్సీ బెంగ‌ళూరు: ఎండిజైన్‌- ప్రొడ‌క్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ బాంబే: ఎండిజైన్‌- ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్‌, క‌మ్యూనికేష‌న్‌ డిజైన్‌, యానిమేష‌న్‌, ఇంట‌రాక్షన్ డిజైన్‌, మొబిలిటీ అండ్ వెహిక‌ల్ డిజైన్‌; పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ దిల్లీ: ఎండిజైన్‌- ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన్‌
ఐఐటీ గువాహ‌టి: ఎండిజైన్‌- డిజైన్‌, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ హైద‌రాబాద్‌: ఎండిజైన్‌- విజువ‌ల్ డిజైన్‌, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీ కాన్పూర్‌: ఎండిజైన్‌- డిజైన్‌, పీహెచ్‌డీ- డిజైన్‌
ఐఐటీడీఎం: ఎండిజైన్‌-ప్రొడ‌క్ట్ డిజైన్‌, పీహెచ్‌డీ- డిజైన్‌

Posted on 18-9-2017

Back..