Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఎంఏ వ్యూహం

మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవాలనుకునే సైన్స్‌ విద్యార్థులకూ, ప్రొఫెషనల్‌ కోర్సుగా చదవాలనుకునే కామర్స్‌ విద్యార్థులకూ కల్పతరువు సీఎంఏ (పూర్వం- ఐసీడబ్ల్యూఏ). ఈ నెలలో సీఏంఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షల సందర్భంగా వేటిపై శ్రద్ధ పెట్టాలో తెలుసుకుందాం!

ఇటీవలికాలంలో సీఎంఏ ఫౌండేషన్‌లో కొన్ని మార్పులు చేశారు. ఒకప్పుడు సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో రెండు సెక్షన్లుగా నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్ష 400 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతోంది. అయితే 60 శాతం మార్కుల ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి.
ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు... మొత్తం మీద 50 శాతం (400కి 200) తెచ్చుకుంటేనే ఉత్తీర్ణత సాధ్యం.
సబ్జెక్టులవారీగా...
పేపర్‌ 1: ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)
* ఈ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు పొందాలంటే ప్రాథమిక సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* ఫండమెంటల్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అనే విభాగం అన్ని గ్రూపులవారికీ కొత్తది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
పేపర్‌ 2: ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)
* అకౌంట్స్‌ సబ్జెక్టులో జర్నల్‌ ఎంట్రీస్‌ (చిట్టాపద్దులు) చాలా ముఖ్యమైనవి. ప్రతి అధ్యాయంలోనూ ఇవి ఉంటాయి. ఎంట్రీస్‌ విషయంలో తప్పుగా రాసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా జవాబులు రాయాల్సివుంటుంది.
* ఈ సబ్జెక్టు ఫౌండేషన్‌ కోర్సులోనే కాకుండా ఇంటర్మీడియట్‌ కోర్సు, సీఎంఏ ఫైనల్లో కూడా చాలా ముఖ్యమైనది.
ఇవి గమనించండి!
సీఎంఏ ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ల కోసం కింది సూచనలు పాటించండి.
* గడిచిన రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్షలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నదీ (ఆబ్జెక్టివ్‌గా గానీ, డిస్క్రిప్టివ్‌గా గానీ, ప్రాక్టికల్‌గా, థియరీగా, కేర్‌లాస్‌గా గానీ) విశ్లేషించుకుని అలా సన్నద్ధం కావాలి. ఈ విధంగా చేయడం వల్ల పరీక్షాపత్రాల తారుమార్లను ముందుగానే విశ్లేషించుకోవచ్చు.
* స్కానర్‌ (ఇంతకుముందు పరీక్షల ప్రశ్నపత్రాలను) విశ్లేషించుకోవటానికి సమయం కేటాయించుకోవాలి.
* రివిజన్‌ టెస్ట్‌ పేపర్‌ (ఆర్‌టీపీ), ఎంటీపీ(మోడల్‌టెస్ట్‌ పేపర్‌), పీటీపీ (ప్రాక్టీస్‌ టెస్ట్‌ పేపర్‌)లను తప్పకుండా పునశ్చరణ చేసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా 60 శాతం మార్కులు సాధించవచ్చు.
పేపర్‌ 3: ఫండమెంటల్స్‌ ఆఫ్‌ లాస్‌ అండ్‌ ఎథిక్స్‌ (100 మార్కులు)
* దీనిలో ఉన్న కమర్షియల్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లాస్‌, ఎథిక్స్‌ అనే సబ్జెక్టులు సీఎంఏ ఇంటర్మీడియట్‌ కోర్సులో కూడా ఉన్నాయి. అందుకని దీనిపై అధిక దృష్టి పెట్టాల్సివుంటుంది.
* ఈ సబ్జెక్టును కామర్స్‌, సైన్స్‌ విద్యార్థులు ఇద్దరూ కొత్తగా నేర్చుకోవాల్సిందే!
పేపర్‌ 4: ఫండమెంటల్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (100 మార్కులు)
* స్టాటిస్టిక్స్‌ అనే విభాగం అన్ని గ్రూపులవారికీ కొత్తది. కాబట్టి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
* ఈ పేపర్‌కు సిద్ధమయ్యేటపుడు సూత్రాలు (ఫార్ములాలు) విధిగా ఒక పుస్తకంలో రాసుకుని, రెండు మూడు సార్లు పునశ్చరణ చేయాలి. ఆ విధంగా మర్చిపోకుండా ఉండవచ్చు. వీలైనన్నిసార్లు లెక్కలు సాధన చేస్తే మంచిది.
సీఎంఏ ఇంటర్మీడియట్‌ కోర్సు
అన్ని దశల్లో ఈ ఇంటర్మీడియట్‌ కోర్సు కీలకమైనదని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా చదివితే తొలి ప్రయత్నంలోనే సులువుగా పూర్తిచేయవచ్చు.
* రోజుకు రెండు సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఒకటి థియరీ, మరొకటి సమస్యాత్మకమైన పేపర్‌.
* మొదటి నుంచీ చదివే మెటీరియల్‌నే చివరివరకూ కొనసాగించాలి. తరచూ మెటీరియల్‌ను మార్చటం శ్రేయస్కరం కాదు.
* ఉన్న సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగింటిపై ఎక్కువశాతం దృష్టిపెడితే వాటిల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.
* కనీసం రెండు పేపర్లలో 60 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి కృషి చేయాలి.
సీఎంఏ ఫైనల్‌
దీనిలో గ్రూప్‌-3, 4... రెండు గ్రూపులుంటాయి. విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులూ ఒకేసారి, లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల తేడాతో రాయవచ్చు.
* ప్రాబ్లమ్స్‌ను సాధన చేస్తున్నపుడే అనవసరం అనుకున్న లెక్కలను తీసివేస్తూ వెళ్ళడం వల్ల పునశ్చరణ సులువుగా, వేగంగా పూర్తవుతుంది.
* ఫార్ములాలన్నిటినీ ఒక నోట్‌బుక్‌లో రాసుకుని చూసుకోవాలి.
* ఫ్లో- చార్టులను కూడా వేసుకుంటే మంచిది.
* గత ఐదేళ్ల పాత ప్రశ్నపత్రాలను అభ్యాసం చేయడం ప్రయోజనకరం.
* స్టడీమెటీరియల్‌, ఆర్‌టీపీ, ఎంటీపీ, పీటీపీల్లోని సమస్యలన్నీ సాధన చేయాలి.
* ఇటీవలే చేసిన సవరణలు (అమెండ్‌మెంట్స్‌) తప్పనిసరిగా చదవాలి.
* ఉన్న ఎనిమిది సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగింటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి చదవాలి. అలా చేస్తే వాటిలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.


Back..

Posted on 14-06-2016