Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒకే ప‌రీక్షతో ప‌ది సెంట్రల్‌ యూనివ‌ర్సిటీల్లో ప్రవేశం

- బీటెక్‌, ఎంటెక్‌ల‌తో స‌హా డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వ‌ర‌కు వివిధ కోర్సుల్లో చేరే అవ‌కాశం
- సీయూ సెట్‌-2017తో సాధ్యం

ఇంట‌ర్ చ‌దివిన విద్యార్థులు డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, ఇంటిగ్రేటెడ్ బీఎడ్‌; డిగ్రీ పూర్తిచేసిన‌వాళ్లైతే పీజీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ...ఇలా ప‌లు కోర్సుల్లో ప‌ది కేంద్రీయ విశ్వవిద్యాల‌యాల్లో చేరే అవ‌కాశం క‌ల్పిస్తుంది సెంట్రల్ యూనివ‌ర్సిటీస్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్టు (సీయూసెట్‌). సీయూసెట్ ద్వారా ప్రవేశం ల‌భించిన‌వాళ్లు మెరుగైన వ‌స‌తులతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించవ‌చ్చు. సీయూసెట్ ప్రక‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో అవ‌కాశం క‌ల్పిస్తున్న సంస్థలు, కోర్సుల వివ‌రాలు తెలుసుకుందాం.

ఇవీ వ‌ర్సిటీలు
సెంట్రల్ యూనివ‌ర్సిటీ - హ‌ర్యానా, జ‌మ్మూ, ఝార్ఖండ్‌, క‌ర్నాట‌క‌, కాశ్మీర్‌, కేర‌ళ‌, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, ద‌క్షిణ బిహార్‌, త‌మిళ‌నాడు సెంట్రల్ యూనివ‌ర్సిటీల‌తోపాటు కొత్తగా బెంగ‌ళూరులో ఏర్పాటుచేసిన బెంగ‌ళూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ (బేస్‌) లో సైతం అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎక‌నామిక్స్‌) కోర్సులో ప్రవేశం ల‌భిస్తుంది.

ఇవీ కోర్సులు
ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు:
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ - ప‌వ‌ర్ అండ్ ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ.
బీటెక్‌: క‌ంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాల‌జీ
ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌, బీఏ బీఎడ్‌
బీఎస్సీ, బీబీఏ, బీఏ, బీఏ ఎల్ఎల్‌బీ, బీఎస్సీ- టెక్స్‌టైల్స్‌

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ- ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, జువాల‌జీ, లైప్ సైన్సెస్‌, బ‌యోకెమిస్ట్రీ, బ‌యోటెక్నాల‌జీ, మైక్రో బ‌యాల‌జీ, బోట‌నీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, ఎక‌నామిక్స్‌,
ఇంటిగ్రేటెడ్ ఎంఏ- ఇంగ్లిష్‌, ఎక‌నామిక్స్‌, సైకాల‌జీ, జాగ్రఫీ, జియాల‌జీ, ఎక‌నామిక్స్‌
బ్యాచిల‌ర్ ఆఫ్ ఒకేష‌న‌ల్ స్టడీస్‌- రిటైల్ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, బ‌యో మెడిక‌ల్ సైన్సెస్‌, ఇండ‌స్ట్రియ‌ల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌, ఇంటీరియ‌ర్ డిజైన్‌, రిటైల్ అండ్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్‌.
బీపీఏ-మ్యూజిక్‌
డిప్లొమా- బ్యూటీ అండ్ వెల్‌నెస్‌

డిగ్రీ విద్యార్థుల‌కు...
ఎంఏ- ఎడ్యుకేష‌న్‌, ఇంగ్లిష్‌, ఇంగ్లిష్ అండ్ కంపారిటివ్ లిట‌రేచ‌ర్‌, లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టెక్నాల‌జీ, లింగ్విస్టిక్స్‌, హిందీ, హిందీ అండ్ కంపారిటివ్ లిట‌రేచ‌ర్, మ‌ల‌యాళం, పంజాబీ, క్లాసిక‌ల్ త‌మిళ్‌, క‌న్నడ, హిస్టరీ, హిస్టరీ అండ్ ఆర్కియాల‌జీ, పెర్ఫార్మింగ్ అర్ట్స్ (ఓక‌ల్ మ్యూజిక్‌), మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌, పెర్ఫార్మింగ్ అర్ట్స్ (థియేట‌ర్ ఆర్ట్స్‌), ఫోల్‌క్లోరిస్టిక్ అండ్ ట్రైబ‌ల్ స్టడీస్‌, ఫోల్‌క్లోరిస్టిక్స్, జాగ్రఫీ, ఇండీజీనియ‌స్ క‌ల్చర్ స్టడీస్‌, సోష‌ల్ వ‌ర్క్‌, సోషియాల‌జీ, హ్యూమ‌న్ రైట్స్ అండ్ క‌న్ఫ్లక్ట్ మేనేజ్‌మెంట్‌, సైకాల‌జీ, అప్లైడ్ సైకాల‌జీ, జ‌ర్నలిజం అండ్ మాస్ క‌మ్యూనికేష‌న్‌, క‌న్వర్జెంట్ జ‌ర్నలిజం, క‌ల్చర్ అండ్ మీడియా స్టడీస్‌, మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ న్యూ మీడియా, నేష‌న‌ల్ సెక్యూరిటీ స్టడీస్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్ అండ్ పొలిటిక‌ల్ సైన్స్‌, పొలిటిక‌ల్ సైన్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌, ప‌బ్లిక్ పాల‌సీ అండ్ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్, కంపారిటివ్ రెలిజియ‌న్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ ఎక‌నామిక్స్‌, అప్లైడ్ క్వాలిటేటివ్ ఫైనాన్స్‌, ఫైనాన్సియ‌ల్ ఎక‌నామిక్స్‌, జ‌న‌ర‌ల్ ఎక‌నామిక్స్, యాక్చూరియ‌ల్ ఎక‌నామిక్స్‌, ఎక‌నామిక్స్, డిజిట‌ల్ సొసైటీ

ఎమ్మెస్సీ- జాగ్రఫీ, అప్లైడ్ జాగ్రఫీ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌, అప్లైడ్ జియాల‌జీ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్‌, జియాల‌జీ, జియో ఇన్ఫర్మేటిక్స్‌, జీనోమిక్ సైన్స్‌, యాజిమ‌ల్ సైన్స్‌, బ‌యోకెమిస్ట్రీ, బ‌యోకెమిస్ట్రీ అండ్ మాలిక్యుల‌ర్ బ‌యాల‌జీ, బ‌యోటెక్నాల‌జీ, లైఫ్ సైన్సెస్‌, మైక్రో బ‌యాల‌జీ, ప్లాంట్ సైన్స్‌, బ‌యోకెమిస్ట్రీ, న్యూట్రిష‌న్ బ‌యాల‌జీ, బ‌యోటెక్నాల‌జీ, బ‌యో ఇన్ఫర్మాటిక్స్‌, కెమిస్ట్రీ, కెమిక‌ల్ సైన్సెస్‌, అప్లైడ్ కెమిస్ట్రీ, కంప్యూట‌ర్ సైన్స్‌, మ్యాథ్స్‌, అప్లైడ్ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, మెటీరియ‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, అట్మాస్ఫిరిక్ సైన్స్‌, ఎపిడెమియాల‌జీ అండ్ ప‌బ్లిక్ హెల్త్‌, యోగా థెర‌పీ, డిజిట‌ల్ సొసైటీ

ఎంటెక్‌- కంప్యూట‌ర్ సైన్స్‌, మెటీరియ‌ల్ సైన్స్‌, వాట‌ర్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌, ఎన‌ర్జీ ఇంజినీరింగ్‌, నానో టెక్నాల‌జీ,

ఎల్ఎల్ఎం, బీఎడ్‌, ఎంఫార్మ్‌, ఎంఎస్‌డ‌బ్ల్యు, ఎంసీఏ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ, మాస్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్‌, మాస్టర్ ఆప్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాట‌రింగ్ టెక్నాల‌జీ, ఎంపీఎడ్‌,
పీజీ డిప్లొమా - గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌, కెమిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్

వీటితోపాటు ప‌లు విభాగాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు కూడా ఉన్నాయి.

ప్రవేశ పరీక్షవిధానం
ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ అన్ని కోర్సులకూ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌సీ బీఈడీ కోర్సుకూ ఒకే ప్రవేశ పరీక్షను (UGC001) నిర్వహిస్తున్నారు. పార్ట్‌-ఎ: ఈ విభాగంలో లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, మేథమేటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌ మొదలైనవాటి నుంచి 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సరైన సమాధానాలు రాయాలి. పార్ట్‌-బి: దీనిలో 4 రకాల సంబంధిత సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 25 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ఏవైనా 3 సెక్షన్లలో మొత్తం 75 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు గుర్తించాలి.

సెక్షన్‌-1లో ఫిజిక్స్‌, సెక్షన్‌-2లో కెమిస్ట్రీ, సెక్షన్‌-3లో మేథమేటిక్స్‌, సెక్షన్‌-4లో బయాలజీ (బోటనీ, జువాలజీ) 10+2 సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రతి పరీక్షకూ కాలవ్యవధి 2 గంటలు.

తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్‌ విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈ పరీక్షలకు సంసిద్ధులై ఉంటారు కాబట్టి పార్ట్‌-బి విభాగంలోని సిలబస్‌ వారికి సుపరిచితమే. అందుకని పార్ట్‌-ఎలో అడిగే ప్రశ్నలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పార్ట్‌-బిలోని ప్రశ్నలు జేఈఈ మెయిన్స్‌ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఈడీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఇంటిగ్రేటెడ్‌ ఎకనామిక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ మొదలైన కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- UGC02. దీనిలో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి ఉంటాయి. రెండు పార్ట్‌లకు కలిపి 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌, రీజనింగ్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ నాలెడ్జ్‌లో ఇస్తారు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. సీయూ సెట్‌కు నమూనా పరీక్షలు రాసి లోపాలు సరిదిద్దుకోవడం ముఖ్యం. ప్రతిరోజూ సాధన చేస్తే వేగం, కచ్చితత్వం అలవడతాయి. సమయ నిర్వహణ కూడా సాధ్యమవుతుంది.

డిగ్రీ అర్హత‌తో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నవాళ్లు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ స్థాయి సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అనువర్తిత కోణం చాలా ముఖ్యం. తమ డిగ్రీ సిలబస్‌తో సీయూసెట్‌ సిలబస్‌ను పోల్చి చూసుకుని అదనపు అంశాలను రిఫరెన్స్‌ బుక్స్‌, ఆన్‌లైన్‌ సమాచారం ఆధారంగా అధ్యయనం చేయాలి ఎంఫిల్‌, పీహెచ్‌డీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారు పీజీ పాఠ్యాంశాలు బాగా చ‌ద‌వాలి. నెట్ సిల‌బ‌స్‌నే ఈ ప‌రీక్షకూ తీసుకున్నారు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఏప్రిల్ 19
ప‌రీక్ష తేదీలు: మే 17,18
ఫ‌లితాలు: జూన్ 7న ప్రక‌టిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
వెబ్‌సైట్‌: www.cucet2017.co.in/

సెంట్రల్ యూనివ‌ర్సిటీల వివ‌రాలు
1. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హర్యానా www.cuh.ac.in
2. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ www.cujammu.ac.in
3. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఝార్ఖండ్‌ www.cuj.ac.in
4. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కశ్మీర్‌ www.cukashmir.ac.in
5. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ www.cukerala.ac.in
6. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పంజాబ్‌ www.cup.ac.in
7. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ www.curaj.ac.in
8. సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తమిళనాడు www.cutn.ac.in
9. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆప్ క‌ర్ణాట‌క‌ www.cuk.ac.in
10. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆప్ సౌత్ బిహార్ www.cusb.ac.in

నోటిఫికేష‌న్‌


Back..

Posted on 17-04-2017