Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎమ్మెస్సీ

బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసుకున్న, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెస్సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) సంస్థలు అందిస్తున్నాయి. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో అనుభవం ఉన్నవారు నేరుగా, ప్రస్తుత విద్యార్థులైతే పరీక్ష ద్వారా పీజీ కోర్సులోకి చేరిపోవచ్చు. ఆతిథ్య రంగంలో మరింత నైపుణ్యాన్ని పొంది, నిపుణులుగా రాణించాలని కోరుకునేవారికి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఫ్యాకల్టీగా సేవలందించాలనుకునేవారికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కోర్సును నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ), ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) సంయుక్తంగా రూపొందించాయి. ఐహెచ్‌ఎం-నోయిడా, న్యూదిల్లీ, బెంగళూరు, చెన్నై, లఖ్‌నవూ, కోల్‌కతా క్యాంపస్‌ల్లో ఎమ్మెస్సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు బోధిస్తున్నారు.
అర్హత: బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసినవాళ్లు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సు చదువుతున్నవారు ఎమ్మెస్సీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆతిథ్య రంగంలో అనుభవం ఉన్నవారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు. బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అనంతరం రెండేళ్లు ఆపైన కనీసం మూడు నక్షత్రాల హోటల్‌లో పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకుని పరీక్ష అవసరం లేకుండా ప్రవేశం పొందవచ్చు.
పరీక్ష ఇలా.. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి 80 ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 25
దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450
పరీక్ష తేదీ: మే 19 (ఉదయం 10 నుంచి 12 వరకు)
వెబ్‌సైట్లు:www.thims.gov.in, www.nchm.nic.in

Back..

Posted on 27-02-2018