Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
స‌శ‌స్త్ర సీమ‌బ‌ల్‌లో 2068 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

* విద్యార్హత ప‌దోత‌ర‌గ‌తి

కేంద్ర హోం శాఖ ఆధీనంలోని స‌శ‌స్త్ర సీమ బ‌ల్ (ఎస్ఎస్‌బీ) వివిధ ట్రేడ్‌ల్లో 2068 కానిస్టేబుల్ పోస్టులకు ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హత‌తో ఈ ఖాళీలు భ‌ర్తీ చేస్తారు. అయితే అద‌నంగా సంబంధిత ట్రేడ్‌ల్లో స‌ర్టిఫికెట్‌, ప‌రిజ్ఞానం ఉండ‌డం త‌ప్పనిస‌రి. ఫిజిక‌ల్ టెస్టు, రాత ప‌రీక్ష, ట్రేడ్ టెస్టుల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. డ్రైవ‌ర్ పోస్టుకు త‌ప్ప మిగిలిన అన్ని ఖాళీల‌కూ పురుష అభ్యర్థుల‌తోపాటు మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఖాళీల వివ‌రాలు (పురుషులు):
డ్రైవ‌ర్ 731
కుక్‌ 349
వాష‌ర్‌మెన్‌ 170
బార్బర్ 82
స‌ఫాయివాలా 176
వాట‌ర్ క్యారియ‌ర్ 395

స్త్రీలు:
కుక్ 60
వాష‌ర్‌మెన్ 30
బార్బర్ 15
స‌ఫాయివాలా 30
వాట‌ర్ క్యారియ‌ర్ 30

విద్యార్హత‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌. పై అన్ని పోస్టుల‌కూ సంబంధిత విభాగాల్లో స‌ర్టిఫికెట్‌, ప‌ని అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్యం. డ్రైవ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ త‌ప్పనిస‌రి.

వ‌యోప‌రిమితి: డ్రైవ‌ర్ పోస్టుల‌కు 21 నుంచి 27 ఏళ్లు, మిగిలిన అన్ని పోస్టుల‌కూ 18 నుంచి 23 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి)

ఎంపిక ఇలా...
ముందుగా ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులు 4.8 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో ప‌రుగెత్తాలి. మ‌హిళ‌లైతే 2.4 కి.మీ. దూరాన్ని 18 నిమిషాల్లో చేరుకోవాలి. ఇందులో అర్హత సాధించిన‌వారికి ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్టు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎత్తు, ఊపిరి పీల్చిన‌ప్పుడు, వ‌దిలిన‌ప్పుడు ఛాతీ విస్తీర్ణం ప‌రిశీలిస్తారు. ఆయా పోస్టుల‌కు త‌గ్గ ఎత్తు క‌లిగి ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన త‌ర్వాత క‌నీసం 5 సెం.మీ. వ్యత్యాసం ఉండాలి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించి, సంతృప్తి చెందితే రాత‌ప‌రీక్షకు అవ‌కాశం క‌ల్పిస్తారు.

రాత ప‌రీక్షలో...
పేప‌ర్‌-1తోపాటు ట్రేడ్ టెస్టు నిర్వహిస్తారు. పేప‌ర్ 1లో వంద బ‌హుళైచ్ఛిక (మ‌ల్టిపుల్‌) ప్రశ్నలు అడుగుతారు. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ అండ్ హిందీ, జ‌న‌ర‌ల్ రీజ‌నింగ్ అంశాల్లో ప్రశ్నలు వ‌స్తాయి. ఈ పేప‌ర్లో అర్హత సాధించాలంటే జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 45 శాతం మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి.

ట్రేడ్ టెస్టు...
50 మార్కుల‌కు ట్రేడ్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో 60 శాతం అంటే 30 మార్కులు సాధిస్తేనే అర్హుల‌వుతారు. పేప‌ర్‌-1, ట్రేడ్ టెస్టులో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in

నోటిఫికేష‌న్‌

Back..

Posted on 14-06-2016