Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డిజైన్‌లో బ్యాచిల‌ర్‌ కోర్సుల‌కు యూసీడ్‌

డిజైన్ కోర్సుల్లో రాణించాల‌నుకునే ఇంట‌ర్ విద్యార్థులు త‌ప్పక రాయాల్సిన ప‌రీక్ష యూసీడ్‌. అండ‌ర్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ‌ర్ డిజైన్‌కు సంక్షిప్త రూప‌మే... యూసీడ్‌. ఈ ప‌రీక్ష ద్వారా ఐఐటీ-బాంబే, గువాహ‌టితోపాటు మ‌రికొన్ని పేరొందిన సంస్థల్లో ప్రవేశం ల‌భిస్తుంది. ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులే కాకుండా ఏ గ్రూప్‌వారైనా, రెండేళ్ల ఒకేష‌నల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా చ‌దివిన‌వారు సైతం ఈ ప‌రీక్షను రాయ‌వ‌చ్చు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేసి బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ (బి.డిస్‌) కోర్సులో ప్రవేశం క‌ల్పిస్తారు. ప్రక‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకుందాం...

అర్హత‌:
ఇంట‌ర్ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవ‌త్సరం కోర్సులు చ‌దువుతున్నవాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. సైన్స్‌, కామ‌ర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్.. ఏ బ్రాంచీ విద్యార్థులైనా అర్హులే. 2017లో ఇంట‌ర్ పూర్తిచేసిన‌ విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 2016, అంత‌కంటే ముందు ఇంట‌ర్ పూర్తిచేసిన‌వాళ్లు అన‌ర్హులు. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేష‌నల్ కోర్సులు చ‌దివిన విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. (ఐఐటీ-గువాహటిలో ప్రవేశానికి ఇంట‌ర్ ఎంపీసీ త‌ప్పనిస‌రి. మిగిలిన సంస్థల్లో సీట్లకు ఇంట‌ర్‌/ ఒకేష‌న‌ల్/ డిప్లొమా విద్యార్థులు పోటీ ప‌డ‌వ‌చ్చు)

వ‌యోప‌రిమితి:
అక్టోబ‌రు 1, 1993 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబ‌రు 1, 1988 త‌ర్వాత జన్మించిన‌వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ప‌రీక్ష ఇలా...
ప‌రీక్షను కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది. ప‌రీక్షకు 300 మార్కులు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. అవి...
సెక్షన్ ఎ (న్యూమ‌రిక‌ల్ ఆన్సర్‌ టైప్) : ఈ త‌ర‌హా ప్రశ్నల‌కు జ‌వాబును నేరుగా ఖాళీపై పూరించాలి. ఆప్షన్లు ఉండ‌వు. ఆన్‌లైన్ కీబోర్డు ఉప‌యోగించి స‌మ‌స్య‌ను సాధించుకోవ‌చ్చు. స‌రైన స‌మాధానం రాస్తే 4 మార్కులు. ఈ సెక్షన్‌కు రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్ బి (మ‌ల్టిపుల్ సెల‌క్ట్ టైప్‌): ఈ విభాగంలో ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ స‌రైన జ‌వాబులు ఉండ‌వ‌చ్చు. అభ్యర్థులు స‌రైన ఆప్షన్లు గుర్తిస్తే 4 మార్కులు సొంత‌మ‌వుతాయి. ఆ ప్రశ్నకు ఉన్న స‌రైన స‌మాధానాల‌న్నీ గుర్తిస్తేనే మార్కులు ఉంటాయి. స‌రైన స‌మాధానాల్లో ఒక ఆప్షన్‌ను విడిచిపెట్టినా, స‌రైన స‌మాధానాల‌తోపాటు ఒక స‌రికాని స‌మాధానాన్ని గుర్తించినా మార్కులు కేటాయించ‌రు. గుర్తించిన ఆప్షన్లలో కొన్ని స‌రైన‌వి ఉన్నప్పటికీ పాక్షిక‌ మార్కులు కేటాయింపు విధానం ఉండ‌దు. అలాగే ఈ సెక్షన్‌లో రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్ సి (మ‌ల్టిపుల్ ఛాయిస్ టైప్‌): ఈ విభాగంలో ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఉంటాయి. అయితే వీటిలో ఒక ఆప్షన్ మాత్రమే స‌రైన‌ది. మిగిలిన‌వి స‌రికానివి. అందువ‌ల్ల ఈ విభాగానికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి స‌రైన జ‌వాబుకు 3 మార్కులు ఉంటాయి. అలాగే త‌ప్పు స‌మాధానం గుర్తిస్తే ఒక మార్కు త‌గ్గిస్తారు.

ఈ అంశాల్లో ప్రశ్నలు...
విజువ‌లైజేష‌న్ అండ్ స్పేషియ‌ల్ ఎబిలిటీ, అబ్జర్వేష‌న్ అండ్ డిజైన్ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంట‌ల్ అండ్ సోష‌ల్ అవేర్‌నెస్‌, ఎన‌లిటిక‌ల్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, డిజైన్ థింకింగ్ అండ్ ప్రోబ్లమ్ సాల్వింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. పాత ప్రశ్నప‌త్రాలు-జ‌వాబులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప‌రిశీలించడం ద్వారా ప‌రీక్ష విధానం, ప్రశ్నల స్వరూపంపై అవ‌గాహ‌న‌కు రావ‌చ్చు. సృజ‌న‌, ఆలోచ‌న‌, తార్కిక‌తల‌పై ముడిప‌డి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి.

ప్రవేశం క‌ల్పించే సంస్థలు
ఐఐబీ-బాంబే, గువాహ‌టి
ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జ‌బ‌ల్‌పూర్‌
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ - కోక్రాజ్‌హ‌ర్‌
ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ-న్యూదిల్లీ
యూపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - నోయిడా
ల‌వ్‌లీ ప్రొఫెష‌న‌ల్ యూనివ‌ర్సిటీ - ఫ‌గ్‌వారా, పంజాబ్‌
యూనివ‌ర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎన‌ర్జీ స్టడీస్ - డెహ్రాడూన్‌

సీట్లు:
ఐఐటీ-బాంబేలో 30, ఐఐటీ-గువాహ‌టిలో 45, ఐఐఐటీడీఎం-జ‌బ‌ల్‌పూర్‌లో 45 చొప్పున సీట్లు ఉన్నాయి. మిగిలిన సంస్థల్లో సీట్ల వివ‌రాలు ప్రక‌టించ‌లేదు. ఐఐటీ-బాంబేలో చేరిన‌వాళ్లు కావాల‌నుకుంటే బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ అనంత‌రం మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులో చేరవ‌చ్చు. కోర్సు మూడో సంవ‌త్సరంలో ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి. ఇలా చేరిన‌వారికి బీడిస్ + ఎండిస్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అయిదేళ్లలో పూర్తవుతుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 10, 2017
రూ. 500 ఆల‌స్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 17, 2017
అడ్మిట్ కార్డులు: డిసెంబ‌రు 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు
ప‌రీక్ష తేదీ: జ‌న‌వ‌రి 20, 2018 ( శ‌నివారం, ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు)
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
ప్రాథ‌మిక కీ: జ‌న‌వ‌రి 27న విడుద‌ల చేస్తారు.
ఫ‌లితాలు: ఫిబ్రవ‌రి 18న ప్రక‌టిస్తారు
రిజిస్ట్రేష‌న్ ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.1180, మిగిలిన అంద‌రికీ రూ.2360

Information Brochure Apply Online Website

Posted on 02-11-2017

Back..

Previous Papers

UCEED - 2017 Question Paper & Key

UCEED - 2016 Question Paper & Key

UCEED - 2015 Question Paper & Key