Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నేర్చుకుందాం.. ఏఐ ఉచితంగా!

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ఉచితంగా ఆ అవకాశాన్ని అందిస్తోంది. మూక్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా యూజీసీ దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఈ 15 వారాల కోర్సులో చేరవచ్ఛు.

అన్ని రంగాల్లోనూ ఏఐ వినియోగం విస్తృతమవుతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. వీరిలో విద్యార్థులతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. వీరందరికీ సాయపడేలా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సును అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనిని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా చెబుతున్నప్పటికీ, ఆసక్తి ఉన్నవారెవరైనా చేరగలిగే వీలు కల్పించారు.

కోర్సును యూజీసీ మూక్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇది ఎంహెచ్‌ఆర్‌డీ స్వయంకు సంబంధించిందే. కోర్సు వ్యవధి 15 వారాలు. 36 లర్నింగ్‌ మాడ్యూళ్లు ఇందులో ఉన్నాయి. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ రూపొందించారు. ప్రతి మాడ్యూల్‌ ఈ-టెక్స్ట్‌, సెల్ఫ్‌ లర్నింగ్‌ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఈ-టెక్స్ట్‌ పీడీఎఫ్‌ల రూపంలో ఉంటుంది. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించారు. సెల్ఫ్‌ లర్నింగ్‌లో వీడియోలు అందుబాటులో ఉంటాయి.

ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో సైన్‌అప్‌ అయ్యి జాయిన్‌ కావచ్ఛు కోరుకున్నది నేర్చుకోవచ్ఛు వివరాలకు http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/view_module_ug.php/338; లేదా http://ugcmoocs.inflibnet.ac.in/ugcmoocs/ ను సందర్శించవచ్ఛు.

ఏయే మాడ్యూళ్లు?
ఏఐ అంటే ఏమిటి? ఏఐ టెక్నిక్స్‌, ఏ సమస్యలకు ఏఐ అవసరం?; స్టేట్‌ స్పేస్‌ సెర్చ్‌ 1 అండ్‌ 2; అన్‌గైడెడ్‌ సెర్చ్‌ మెథడ్స్‌; హ్యురిస్టిక్‌ అండ్‌ అదర్‌ సెర్చ్‌ మెథడ్స్‌; ప్రాబ్లమ్స్‌ విత్‌ సెర్చ్‌ మెథడ్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌; జెనెటిక్‌ అల్గారిథమ్‌ అండ్‌ ట్రావెలింగ్‌ సేల్స్‌మన్‌ ప్రాబ్లమ్‌; ఆంట్‌ కాలనీ ఆప్టిమైజేషన్‌, బ్రాంచ్‌ అండ్‌ బౌండ్‌, రిఫైన్‌మెంట్‌ సెర్చ్‌; యూజింగ్‌ ఫజ్జీ లాజిక్‌; ఫ్రేమ్స్‌ అండ్‌ సెమాంటిక్‌ నెఫ్టార్‌ నాలెడ్జ్‌ రెప్రజెంటేషన్‌; మెషిన్‌ లర్నింగ్‌ మొదలైన మాడ్యూళ్లు ఉన్నాయి.

Back..

Posted on 14-05-2020