Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వేసవిలో నైపుణ్యాలు పెంచుకుందాం!

* అడ్వాన్స్‌డ్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంటర్న్‌షిప్‌ కమ్‌ ట్రెయినింగ్‌

లాక్‌డౌన్‌ త్వరలో పూర్తవుతుంది. ఆపై వేసవి సెలవులు. ఈ సమయాన్నీ ప్రయోజనకరంగా మలచుకోవాలనుకునేవారికి ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (ఏఐసీటీఎస్‌డీ) సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తోంది. పాఠశాల విద్యార్థులతో పాటు కళాశాలలో చదివేవారూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఐఐటీ బాంబే పూర్వవిద్యార్థులు సంయుక్తంగా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. ఇదో అడ్వాన్స్‌డ్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంటర్న్‌షిప్‌ కమ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లో విద్యార్థి తనకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. స్కూలు, కాలేజీల విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రాములన్నీ పరిశ్రమలు సర్టిఫై చేసినవే. వీటిని ఐఐటీ బాంబే పూర్వవిద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. స్కూలు, కళాశాల విభాగాల వారికి వేర్వేరు అంశాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశముంది.

కళాశాల విభాగంలో..
ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డెవలపర్‌: రాస్‌బెర్రీ పీఐ ఐఓటీ అండ్‌ ఆర్డినో ప్రొఫెషనల్‌ లెవల్‌ ట్రైనింగ్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్స్‌, అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌, ప్రాజెక్ట్‌ మాడ్యూల్‌ ఇంటర్‌ఫేసింగ్‌ అంశాలకు సంబంధించినది.
పీఎల్‌ ఆటోమేషన్‌ డెవలపర్‌: ఇందులో పీఎల్‌సీ, స్కాడా అండ్‌ ఎంబెడెడ్‌ ఆర్డినో ప్రొఫెషనల్‌ లెవల్‌ ట్రైనింగ్‌, పీఎల్‌సీ ప్రోగ్రామింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్స్‌, ఆర్డినో ప్రోగ్రామింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైనింగ్‌, ప్రాజెక్ట్‌ మాడ్యూల్‌ ఇంటర్‌ఫేస్‌ ఉన్నాయి.
ఆర్టిఫిషియల్‌ ఇంలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌: ఆర్టిఫిషియల్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ ప్రోగ్రామింగ్‌, ప్రోటోకాల్‌ డిజైనింగ్‌, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌, అల్గారిథమ్‌ డెవలప్‌మెంట్‌, ప్రొఫెషనల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ అప్లికేషన్‌ డిజైనింగ్‌ అంశాలుంటాయి. వీటితోపాటు రాస్‌బెర్రీ పీఐ ఐఓటీ డెవలపర్‌, ఆర్టినో డెవలపర్‌, పైథాన్‌ డేటాసైన్స్‌ డెవలపర్‌ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసుకోవచ్చు.
అర్హతలు: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, డిప్లొమా, బీఎస్‌సీ/ ఎంఎస్‌సీ విద్యార్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకునేవారికి పూర్తి ట్రెయినింగ్‌ కిట్‌, మెటీరియల్‌ను శిక్షణకు వారం ముందే విద్యార్థికి అందజేస్తారు. సాధారణంగా వ్యవధి 2 వారాల నుంచి నెల వరకూ ఉంటుంది. పాఠశాల విభాగంలో స్కూల్‌ రోబోటిక్స్‌ డెవలపర్‌, స్కూల్‌ ప్రోగ్రామర్‌ డెవలపర్‌ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఉన్నాయి. 11 సంవత్సరాలు నిండిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష, సర్టిఫికేషన్‌
ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా మొదటి ముగ్గురు విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తారు. మొదటి బహుమతిగా రూ.75,000 నగదుతోపాటు ఏడాదిపాటు ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ లభిస్తుంది. రెండో బహుమతిగా రూ.25,000 నగదుతోపాటు ఆరు నెలలపాటు ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌; మూడో బహుమతిగా రూ.5000 నగదుతోపాటు మూడు నెలల ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌లను అందజేస్తారు. ఏఐసీటీఎస్‌డీ నుంచి సర్టిఫికెట్‌నూ పొందుతారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1500.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2020.
వెబ్‌సైట్‌: https://www.aictsd.com/

Back..

Posted on 22-04-2020