Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పీజీ కోసం..

పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) నుంచి ప్రకటన వెలువడింది. ఏఎన్‌యూపీజీసెట్‌ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. వీటి ర్యాంకు ఆధారంగా ఏఎన్‌యూ, దాని అనుబంధ కళాశాలలతోపాటు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ, దాని అనుబంధ సంస్థల్లోనూ ప్రవేశం పొందొచ్ఛు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఏఎన్‌యూ పీజీసెట్‌ (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)- 2020ను ఈ ఏడాది ఏఎన్‌యూ, గుంటూరు; ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం విశ్వవిద్యాలయం (ఏకేటీపీయూ), ఒంగోలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా ఈ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పీజీసెట్‌ ర్యాంకు ఆధారంగా సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌, లాంగ్వేజెస్‌ విభాగాల్లో ఎంఎస్‌సీ, ఎంఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తారు. ఏఎన్‌యూలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులతో కలిపి మొత్తం 48, ఏకేటీపీయూలో 22 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులకు ప్రవేశపరీక్ష లేదు.

డిగ్రీ స్థాయిలో సంబంధిత విభాగాల్లో బీఎస్‌సీ/ బీఏ/ బీకాం/ బీబీఎం/ బీసీఏ/ బీఏ/ బీకాం పూర్తిచేసినవారు అర్హులు. గరిష్ఠ వయః పరిమితి ఏమీ లేదు. అర్హత కలిగినవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్ఛు ఈ ఏడాది డిగ్రీ పూర్తి చేయబోయేవారూ అర్హులే.

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో (www.pgcet.anudoa.in/) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఓసీ/ బీసీ వారికి రూ.600, ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ వారికి రూ.500. రిజర్వేషన్‌ ఉంది. ఎస్‌సీ వారికి 15%, ఎస్‌టీవారికి 6%, బీసీ వారికి 29%, పీహెచ్‌ వారికి 3%, అమ్మాయిలకు 33.3% ఉంది.

పరీక్ష విధానం
* ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో మార్కు. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ఆఫ్‌లైన్‌- పేపర్‌, పెన్ను విధానంలో జరుగుతుంది. సమాధానాలను ఓఎంఆర్‌ షీటు మీద గుర్తించాల్సి ఉంటుంది.
* పీజీసెట్‌ను వివిధ సబ్జెక్టులకు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సిలబస్‌లో మార్పులుంటాయి. ఎంచుకున్న కోర్సు ఆధారంగా సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం.

ముఖ్యతేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి గడువు: ఏప్రిల్‌ 20, 2020
ప్రవేశపరీక్ష తేదీలు: మే 5 నుంచి 7 వరకు

Back..

Posted on 09-03-2020