Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్మీలో 195 ఇంజినీరింగ్ పోస్టులు

- పురుషుల‌కు 175, మ‌హిళ‌ల‌కు 20
- ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
- శిక్షణ పూర్తి చేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం
- నెల‌కు రూ.70 వేల వేత‌నం

వివిధ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో పోస్టుల భ‌ర్తీకి షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌) ప్రక‌ట‌న‌ను ఆర్మీ విడుద‌ల‌చేసింది. సంబంధిత విభాగంలో బీటెక్ చ‌దివిన‌వాళ్లు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపికైన‌వారికి ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి చెన్నైలో శిక్షణ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ స‌మ‌యంలో రూ.21,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంత‌రం పీజీ డిప్లొమా డిగ్రీ ప్రదానం చేస్తారు. అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలోకి చేరిన త‌ర్వాత ప్రతి నెలా రూ.70,000 (సీటీసీ విధానంలో) వేత‌నంగా పొంద‌వ‌చ్చు. జీతంతోపాటు ప‌లు ప్రోత్సాహ‌కాలూ ల‌భిస్తాయి. ప్రక‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు: 195 ( పురుషుల‌కు: 175, మ‌హిళ‌ల‌కు: 20)

ఇంజినీరింగ్ విభాగాల‌వారీ ఖాళీలిలా..
సివిల్‌: పురుషుల‌కు 42, మ‌హిళ‌ల‌కు 5
మెకానిక‌ల్‌: పురుషుల‌కు 12, మ‌హిళ‌ల‌కు 4
ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్: పురుషుల‌కు 18, మ‌హిళ‌ల‌కు 4
ఏరోనాటిక‌ల్‌/ ఏవియేష‌న్‌/ ఏరోస్పేస్‌/ బాలిస్టిక్స్‌/ ఏవియానిక్స్‌: పురుషుల‌కు 13, మ‌హిళ‌ల‌కు లేవు
కంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ: పురుషుల‌కు 27, మ‌హిళ‌ల‌కు 4
ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలికాం/ టెలీ క‌మ్యూనికేష‌న్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ శాటిలైట్ క‌మ్యూనికేష‌న్‌: పురుషుల‌కు 26, మ‌హిళ‌ల‌కు 3
ఎల‌క్ట్రానిక్స్‌/ ఆప్టో ఎల‌క్ట్రానిక్స్‌/ ఫైబ‌ర్ ఆప్టిక్స్‌/ మైక్రో ఎల‌క్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్‌: పురుషుల‌కు 13, మ‌హిళ‌ల‌కు లేవు
ఇండ‌స్ట్రియ‌ల్‌: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు లేవు
ఆటో మొబైల్‌/ వ‌ర్క్‌షాప్ టెక్నాల‌జీ: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు లేవు
మెట‌ల‌ర్జిక‌ల్‌: పురుషుల‌కు 3, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్: పురుషుల‌కు 3, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
ఆర్కిటెక్చర్‌/ బిల్డింగ్ క‌న్‌స్ట్రక్షన్ టెక్నాల‌జీ: పురుషుల‌కు 4, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
కెమిక‌ల్: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
ప్రొడ‌క్షన్: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
రిమోట్ సెన్సింగ్‌: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
ట్రాన్స్‌పోర్టేష‌న్‌: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు
లేజ‌ర్ టెక్‌: పురుషుల‌కు 2, మ‌హిళ‌ల‌కు ఖాళీలు లేవు

విద్యార్హత‌:
స‌ంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. కంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ పోస్టుల‌కు మాత్రం ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తిచేసిన‌వాళ్లు సైతం అర్హులే. ప్రస్తుతం ఇంజినీరింగ్ ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే అక్టోబ‌రు 1, 2017 నాటికి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

వ‌యోప‌రిమితి:
అక్టోబ‌రు 1, 2017 నాటికి 20-27 ఏళ్లలోపు వ‌య‌సు ఉండాలి. అంటే అక్టోబ‌రు 2, 1990- అక్టోబ‌రు 1, 1997 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.

శారీర‌క ప్రమాణాలు:
పురుష అభ్యర్థులు 157.5 సెం.మీ. ఎత్తుతోపాటు దానికి త‌గ్గ బ‌రువు ఉండాలి. అదే మ‌హిళ‌లైతే క‌నీసం 152 సెం.మీ. ఎత్తు, 42 కి.గ్రా. బ‌రువు త‌ప్పనిస‌రి.

నియామ‌కాలిలా...
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా వ‌డ‌పోత జ‌రుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు సైకాల‌జిస్ట్‌, గ్రూప్ టెస్టింగ్ ఆఫీస‌ర్‌, ఇంట‌ర్వ్యూయింగ్ ఆఫీస‌ర్ ముఖాముఖి చేప‌డ‌తారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల‌కు ఈ ఇంట‌ర్వ్యూలు బెంగ‌ళూరులో నిర్వహించ‌వచ్చు. ఏప్రిల్‌, మే నెల‌ల్లో ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. రెండు ద‌శ‌ల్లో అయిదు రోజుల‌పాటు ఈ ముఖాముఖి ప్రక్రియ కొన‌సాగుతుంది. ఇందులో రెండు ద‌శ‌లు ఉంటాయి. స్టేజ్‌-1 ఇంట‌ర్వ్యూలు తొలిరోజు చేప‌ట్టి అందులో అర్హత సాధించిన‌వారికి మాత్రమే త‌ర్వాతి ద‌శ‌ స్టేజ్‌-2కు ఎంపిక చేస్తారు. స్టేజ్‌-1 లో ఎంపిక‌కానివాళ్లను తొలిరోజే పంపించేస్తారు. నాలుగు రోజుల పాటు స్టేజ్‌-2 ముఖాముఖి కొన‌సాగుతుంది. ఇందులో భాగంగా బృంద చ‌ర్చలు, కొన్ని చిత్రాల‌ను చూపించి వ‌ర్ణించ‌మ‌న‌డం, సంద‌ర్భాన్ని చెప్పి వివ‌రించ‌మ‌న‌డం, సైకోమెట్రిక్ ప‌రీక్షలు...మొద‌లైన‌వి ఉంటాయి. ఇందులోనూ నెగ్గితే వైద్య ప‌రీక్షలు నిర్వహించి తుది నియామ‌కాల‌కు ఖ‌రారు చేస్తారు.

ఎంపికైతే:
ఈ ఉద్యోగానికి ఎంపికైన‌వారికి చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఓటీఏ)లో 49 వారాల పాటు శిక్షణ నిర్వహిస్తారు. ఈ స‌మ‌యంలో శారీర‌కంగా ఆరోగ్యంగా ఉండ‌డానికి ప్రతి రోజూ ప‌రిగెత్తించ‌డం, పుష్అప్స్‌, సిట్‌అప్స్‌, చిన్ అప్స్‌, రోప్ క్లైంబింగ్‌ .....ఇలా సాధార‌ణ స్థాయి ఫిట్‌నెస్ శిక్షణ ఉంటుంది. దీంతోపాటు డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌, స్ట్రాట‌జీ, అభ్యర్థి ఎంపికైన సాంకేతిక విభాగం(బ్రాంచ్)కు సంబంధించిన త‌ర‌గ‌తులు నిర్వహిస్తారు. శిక్షణ స‌మ‌యంలో నెల‌కు రూ.21,000 చొప్పున స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ వ్యవ‌ధిలో మ‌ధ్యలో వైదొలిగిన‌వాళ్లు ఖ‌ర్చుల నిమిత్తం వారానికి రూ.8785 రూపాలు చొప్పున ఓటీఏకు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్నవారికి డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాట‌జిక్ స్టడీస్‌లో పీజీ డిప్లొమాను మ‌ద్రాస్ యూనివ‌ర్సిటీ ప్రదానం చేస్తుంది. శిక్షణ అనంత‌రం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో కొన‌సాగుతారు. ఈ స‌మ‌యంలో అన్నీ క‌లుపుకుని నెల‌కు రూ.70,000 వ‌ర‌కు వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా నియామ‌కం కాబ‌ట్టి ఎంపికైన‌వాళ్లు 14 ఏళ్లపాటు విధుల్లో కొన‌సాగుతారు. అనంత‌రం అభ్యర్థి స‌మ‌ర్థత‌, అప్పటికున్న అవ‌స‌రాల ప్రాతిప‌దిక‌న ఆస‌క్తి ఉన్నవారిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. అయితే మ‌హిళ‌లు మాత్రం 14 ఏళ్ల త‌ర్వాత స‌ర్వీస్ నుంచి వైదొల‌గాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఫిబ్రవ‌రి 22 ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు.
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

నోటిఫికేష‌న్‌

Back..

Posted on 24-01-2017